జగ్జీవన్‌రామ్ జయంతికి టీడీపీ నేతలు దూరం! | kurnool tdp leaders walks away for babu jagjivan ram anniversary | Sakshi
Sakshi News home page

జగ్జీవన్‌రామ్ జయంతికి టీడీపీ నేతలు దూరం!

Published Mon, Apr 6 2015 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

kurnool tdp leaders walks away for babu jagjivan ram anniversary

కర్నూలు: దేశ ఉప ప్రధాని దివంగత బాబూ జగ్జీవన్‌రామ్ 108వ జయంతి వేడుకలకు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు దూరంగా ఉండటాన్ని దళిత సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి అనంతపురంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు సమాచారం.

 

అయితే జిల్లాకు చెందిన బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి జయంతి కార్యక్రమాలకు గైర్హాజరయ్యారు. కాగా, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే విదేశీ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు ఈ విధంగా ఉంటే మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు తదితర ప్రజా ప్రతినిధులు కూడా జయంతి వేడుకలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement