భూమా నాగిరెడ్డి దాడులు చేయిస్తున్నారు | shilpa mohanreddy complains against bhuma nagireddy to chandra babu | Sakshi
Sakshi News home page

భూమా నాగిరెడ్డి దాడులు చేయిస్తున్నారు

Published Mon, May 2 2016 7:51 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

భూమా నాగిరెడ్డి దాడులు చేయిస్తున్నారు - Sakshi

భూమా నాగిరెడ్డి దాడులు చేయిస్తున్నారు

విజయవాడ: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తమ అనుచరులపై దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఇన్‌చార్జి శిల్పామోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. తాము మొదటినుంచి పార్టీ కోసం పనిచేస్తున్నామని, తమకు తగిన ప్రాధాన్యమివ్వాలని శిల్పామోహన్ రెడ్డి సోదరులు చంద్రబాబును కోరారు. సోమవారం విజయవాడ క్యాంప్ ఆఫీసులో శిల్పామోహన్ రెడ్డి సోదరులు.. భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ వేర్వేరుగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే శిల్పా సోదరులకు, భూమాకు సయోధ్య కుదరలేదు. విభేదాలతో ఇరు వర్గాలు పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇరువర్గాలను పిలిచి రాజీచేసేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల వాదనలు విని, కలసి పనిచేయాలని వారికి సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement