చంద్రబాబు వద్దకు నంద్యాల టీడీపీ పంచాయితీ | Bhuma nagireddy, silpa mohan reddy brothers met cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వద్దకు నంద్యాల టీడీపీ పంచాయితీ

Published Tue, May 3 2016 10:20 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

చంద్రబాబు వద్దకు నంద్యాల టీడీపీ పంచాయితీ - Sakshi

చంద్రబాబు వద్దకు నంద్యాల టీడీపీ పంచాయితీ

విజయవాడ: కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ పంచాయతీ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఇన్‌చార్జి శిల్పామోహన్‌రెడ్డి సోదరులు మంగళవారం చంద్రబాబుతో సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు తమ వాదనలు వినిపించారు. వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే శిల్పా సోదరులకు, భూమాకు సయోధ్య కుదరలేదు.

భూమా నాగిరెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. భూమా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, అంతేకాకుండా తమ అనుచరులపై దాడులు చేయిస్తున్నారని శిల్పా సోదరులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు భూమా నాగిరెడ్డితో పాటు శిల్పా సోదరులను చంద్రబాబు పిలిపించారు. నిన్న కూడా ఇరువర్గాలు విడివిడిగా చంద్రబాబుతో భేటీ అయిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement