
బాబు వైఖరి భవిష్యత్తు తరాలకు శాపం: కేవీపీ
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. చంద్రబాబు స్వార్ద వైఖరి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుందని, ఆయన తీరు భవిష్యత్తు తరాలకు శాపం లాంటిదని ఆయన అన్నారు. సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా భరోసా సభను అధికార బలంతో అడ్డుకునేందుకు చంద్రబాబు యత్నించారని ఆరోపించారు.
దేశ రాజకీయాల్లో చంద్రబాబు విష సంస్కృతిని ప్రవేశపెడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో లోపాలను సవరించుకొని పార్లమెంటులో కొత్త చట్టం తెచ్చుకోవడానికి అందరు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా చంద్రబాబు తన పార్టీ ఎంపీలు కేంద్రమంత్రులతో కలిసి ముందుకు రావాలని ఆయన కోరారు.