గిన్నిస్ బుక్‌లోకి ‘శ్రీభక్తాంజనేయ’ లడ్డూ
వరుసగా ఐదోసారి ప్రపంచ రికార్డు
తాపేశ్వరం(మండపేట): తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని శ్రీభక్తాంజనేయ స్వీట్ స్టాల్ తన పాత రికార్డులను తిరగరాసింది. భారీ లడ్డూ తయూరీతో వరుసగా ఐదోసారి గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ వివరాలను సంస్థ అధినేత సలాది శ్రీనుబాబు సోమవారం విలేకరులకు తెలిపారు. వినాయక చవితి వేడుకల సందర్భంగాఆర్డర్లపై 2011లో 5,570 కేజీలు, 2012లో 6,599 కేజీలు, 2013లో 7,132 కేజీలు, 2014లో 7,858 కేజీల లడ్డూలు తయారుచేసి వరుసగా నాలుగేళ్లపాటు గిన్నిస్ రికార్డులు నెలకొల్పామన్నారు.
ఈ ఏడాది విశాఖ నుంచి వచ్చిన ఆర్డరు మేరకు 8,369 కేజీల లడ్డూ తయారీ ద్వారా ఐదోసారి గిన్నిస్ రికార్డు సాధించినట్లు చెప్పారు. 2016 వినాయక చవితి వేడుకల కోసం భారీ లడ్డూలు తయారుజేసి రెండు గిన్నిస్ రికార్డులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.