laddu making
-
సిట్ విచారణకు వచ్చినప్పుడు అంతా ఒకటే మాట చెప్పాలి
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల: తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయంటూ ‘కొవ్వు ప్రకటన’ చేసిన సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు షాకివ్వడంతో ఆయన వ్యూహం మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ను పక్కనపెట్టిన అత్యున్నత న్యాయస్థానం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల బృందానికి విచారణ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ బృందంలో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఇద్దరు, కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి ఒకరు ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కొత్త వ్యూహానికి తెరతీశారు. ఇందులో భాగంగా శుక్రవారం తిరుమలలో స్వామివారికి పట్టు వ్రస్తాలు సమర్పించిన సీఎం శనివారం టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిపై మన స్టాండ్ ఏమిటో మీకు తెలుసుకదా. సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ బృందం విచారణకు వస్తే అంతా ఒకటే మాట మీద ఉండాలి. ఎవరూ నా మాటకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. అందరికీ ఈ మేరకు ట్రైనింగ్ ఇవ్వండి. ఆ బృందంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు అనుకూలమైనవారే ఉంటారు. ఆ ఇద్దరు అన్నీ చూసుకుంటారు’ అని ముఖ్య అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సీఎం చంద్రబాబు తిరుమల పద్మావతి అతిథిగృహంలో ఐదుగురు ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీఐపీ సంస్కృతి తగ్గాలి.. తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు. ఐదుగురు అధికారులతో సమావేశం ముగిశాక ఆయన దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతిఒక్కరూ పనిచేయాలని ఆదేశించారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని సూచించారు. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని, ముందస్తు ప్రణాళిక చాలా అవసరమన్నారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలన్నారు. వచ్చిన ప్రతి భక్తుడికి అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని సూచించారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగానే టీటీడీ పనిచేయాలన్నారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచించారు. లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని, ఇది ఎల్లప్పుడూ కొనసాగాలని ఆదేశించారు. అలాగే తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదన్నారు. టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలన్నారు. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలని ఆదేశించారు. కాగా తిరుమలలో చంద్రబాబు కేంద్రీకృత వకుళమాత వంటశాలను ప్రారంభించారు. పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున ఔటర్ రింగ్ రోడ్డు పక్కన నిర్మించిన అధునాతనమైన ఈ వంటశాలను సుమారు రూ.13.45 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది. 37,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో దీన్ని నిర్మించారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ కొత్త కేంద్రీకృత వంటశాలలో 1.20 లక్షల మంది యాత్రికులకు అన్నప్రసాదాలు అందిస్తారు. సమావేశం కారణంగానే షెడ్యూల్లో మార్పులు..వాస్తవానికి శనివారం ఉదయం 7.35 గంటలకు వకుళమాత వంటశాల ప్రారంభం తర్వాత సీఎం చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంది. అయితే సీబీఐ నేతృత్వంలో ఏర్పాటు కానున్న సిట్ బృందం తిరుమలకు వచ్చి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఆయన టీటీడీ ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారని చెబుతున్నారు.టీటీడీ అధికారులు, మార్కెటింగ్ సిబ్బందిని సిట్ ఏమడుగుతుంది? ఏం సమాధానం చెప్పాలి? ఎలా స్పందించాలి? అనే విషయాలపై సీఎం చంద్రబాబు ముఖ్య అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు టీటీడీ ఉన్నతాధికారులు సిబ్బందికి కూడా దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.ఎమ్మెల్యే డిక్లరేషన్‌పై వివాదంచిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ శుక్రవారం శ్రీవారి దర్శనం సందర్భంగా ఇచ్చిన డిక్లరేషన్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్వామి వారి దర్శనానికి వెళ్లే సమయంలో తాను క్రిస్టియన్‌ను అని, శ్రీవారిపై విశ్వాసం ఉందంటూ ఎమ్మెల్యే డిక్లరేషన్ ఇచ్చారు. క్రిస్టియానిటీ తీసుకుంటే.. ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని, బీసీ కేటగిరీలోకి వస్తారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన జీడీ నెల్లూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే థామస్‌పై అనర్హత వేటు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తనకు తానుగా తిరుమలలో క్రిస్టియన్‌గా డిక్లరేషన్ ఇచ్చాక ఎస్సీ రిజర్వేషన్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్నారు. -
ఆ నెయ్యి వాడలేదు: లోకేశ్
సాక్షి, అమరావతి: ఆ వెంకటేశ్వరస్వామే తనతో నిజాలు చెప్పించారేమో అని చెబుతున్న సీఎం చంద్రబాబు తన తనయుడు నారా లోకేశ్ వ్యాఖ్యలతో అడ్డంగా దొరికిపోయారు! శ్రీవారి సాక్షిగా తండ్రీ కుమారుడు తమ బండారాన్ని తామే బయటపెట్టుకున్నారు!! టీటీడీ లడ్డూల తయారీకి వినియోగించిన నెయ్యి విషయంలో చంద్రబాబు చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా లోకేశ్ సోమవారం ఎక్స్‌లో ట్వీట్ చేయడంతో టీడీపీ శ్రేణులు కంగుతిన్నాయి. జంతువుల కొవ్వు కలిపిన ఏఆర్ డెయిరీ నెయ్యిని లడ్డూల తయారీకి ఉపయోగించారని, వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు పదేపదే అబద్ధాలు చెప్పి నమ్మించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ లోకేశ్ మాత్రం తాజాగా ట్వీట్లో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి లారీలు నాలుగింటినీ టీటీడీ తిప్పి పంపించేసిందని వెల్లడించి సీఎం స్థానంలో కూర్చున్న తన తండ్రి పచ్చి అబద్ధాల కోరని నిరూపించారు. నాలుగు నెయ్యి లారీలను తిప్పి పంపిన టీటీడీ రిపోర్టును తన ట్వీట్‌కు జత చేశారు. అందులో ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన 8 నెయ్యి ట్యాంకర్లలో నాలుగు టెస్టుల్లో పాసవగా, నాలుగు ట్యాంకర్లలో నెయ్యి ప్రమాణాల ప్రకారం లేకపోవడంతో తిరస్కరణకు గురైనట్లు స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పేది నిజమా? లేక లోకేశ్ చెప్పేది నిజమా? అబద్ధాలు చెప్పడంలో ఇద్దరి మధ్యా సమన్వయం లేదా? కుమారుడికి అబద్ధాఆల ట్రెయినింగ్ సరిగా ఇవ్వలేదా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. జూన్ 12న తొలి ట్యాంకర్ టీటీడీకి జూన్ 12వ తేదీన ఏఆర్ డెయిరీ నుంచి తొలి ట్యాంకర్ టీటీడీకి చేరింది. అదే నెల 21, 25న రెండు, జూలై 4వ తేదీన మరో ట్యాంకర్ వచ్చాయి. మొత్తం నాలుగు నెయ్యి ట్యాంకర్లు టీటీడీ నిర్వహించిన పరీక్షల్లో నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉన్నాయని తేలింది. అందుకే వాటిని స్వీకరించారు. ఆ తర్వాత జులై 6వ తేదీన వచ్చిన రెండు ట్యాంకర్లు, 12న వచ్చిన మరో రెండు ట్యాంకర్లు ప్రమాణాల ప్రకారం లేకపోవడంతో టీటీడీ వాటిని తిరస్కరించింది. లోకేశ్ జత చేసిన రిపోర్టులో ఈ విషయం స్పష్టంగా ఉంది. లేబొరేటరీ పరీక్షల్లో ఈ నాలుగు ట్యాంకర్లను తిరస్కరించారంటే అందులోని నెయ్యిని లడ్డూల తయారీకి వినియోగించలేదని విస్పష్టంగా తెలుస్తోంది. కానీ చంద్రబాబు ఆ నెయ్యిని వాడేసినట్లు, వాటితో తయారైన లడ్డూలను భక్తులను తినేసినట్లు చెబుతూ జనాన్ని తప్పుదోవ పట్టించారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి ఇష్టం వచ్చినట్లు అడ్డగోలు భాషలో అడ్డంగా మాట్లాడే క్రమంలో లోకేష్ మరోసారి తాను పప్పునని బయట పెట్టుకున్నారు. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి కొవ్వు ఎక్కువైందంటూ అధికారం అండతో అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించిన లోకేశ్ అదే ట్వీట్ ద్వారా తమ బాగోతాన్ని బహిర్గతం చేశారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. -
అవిసె గింజల పొడి, బాదాం, ఎండు ఖర్జూరంతో రాగి లడ్లు.. నెలకు లక్ష..
సుచేత భండారే 5 వేల రూపాయలతో రెండేళ్ల క్రితం రాగిలడ్లు చేయడం మొదలెట్టింది. ఇవాళ నెలకు లక్ష రూపాయల లడ్లు ఆన్లైన్లో అమ్ముతోంది. సేంద్రియ రాగులు.. అవిసె గింజల పొడి.. బాదాం, ఎండు ఖర్జూరం... వీటితో తయారు చేసే రాగిలడ్ల బలం ముందు జంక్ ఫుడ్ దిగదుడుపు. ‘భూమి నుంచి వచ్చేది తినండి పెనం నుంచి వచ్చేది కాదు’ అంటుంది సుచేత. ఈ లడ్డు లాంటి ఆలోచనను ఎవరైనా ఆచరణలో పెట్టొచ్చు. మీరు ఇంట్లో రాగి లడ్డు చేయాలంటే ఏమేమి ఉపయోగిస్తారు? సుచేత భండారే మాత్రం ఇవి ఉపయోగిస్తుంది. రాగి పిండి, బెల్లం, ఆవు నెయ్యి, అవిసె గింజల పొడి, బాదం పొడి, ఎండు ఖర్జూరం పొడి, ఏలకులు. వీటితో రాగిలడ్డూలు తయారు చేసి 16 లడ్డూలు ఒక మంచి అట్టపెట్టెలో పెడుతుంది. వాటిని ఎక్కడెక్కడి నుంచో రూ.439 రూపాయలు చెల్లించి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆమె ఈ పని కోసం ఏడు మంది గ్రామీణ మహిళలను పనిలోకి తీసుకుంది. అందరూ కలిసి ఇప్పుడు నెలకు దాదాపు 2,500 రాగి లడ్డూలు తయారు చేస్తారు. ఇంకా అటుకుల చిరుతిండి, బొరుగుల చిరుతిండి తయారు చేస్తారు. మొత్తం లక్ష రూపాయల బిజినెస్ జరుగుతుంది. పెద్ద కార్ఖానా లేదు. షాప్ లేదు. రెంట్ లేదు. ఏమీ లేదు. ఆన్లైన్ మీదే అన్నీ పార్శిల్ అయిపోతాయి. ఒకసారి సుచేత లడ్లు తెప్పించుకున్నవారు మళ్లీ మళ్లీ ఆర్డరు పెడుతుంటారు. ఆమె ఆలోచన సుచేత భండారేది పూణె సమీపంలో ఉన్న వడ్నేర్ భైరవ్ అనే గ్రామం. ‘నా బాల్యం అంతా బలవర్థకమైన చిరుతిండ్లతోనే గడిచింది. మా పొలంలో వరి, బంగాళ దుంపలు తప్ప దాదాపు అన్నీ పండించేవాళ్లం. ఇంట్లో నాకు పచ్చి కొబ్బరి, అటుకులు, రాగి లడ్లు, బొరుగులు, సున్ని ఉండలు, మేము పండించిన పండ్లు ఇవి పెట్టేవాళ్లు. బజారులో దొరికేది ఏదీ నేనే తినలేదు. అలాగే స్కూల్ అయిపోయిన వెంటనే మా పొలానికి వెళ్లేదాన్ని. ముఖ్యంగా కోత సమయాల్లో నేను చాలా ఉత్సాహంగా ఉండేదాన్ని. మట్టితో నాకు అప్పుడే అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు అది నా పనిలో కనిపిస్తోంది’ అంటుంది 35 ఏళ్ల సుచేత. వ్యవసాయం మీద ఆసక్తితో అగ్రికల్చర్ బిఎస్సీ చేయాలనుకుంది కాని కుదరక డిగ్రీలో కామర్స్ చదివింది. ఆ తర్వాత కొన్నాళ్లు పూణెలో కాల్ సెంటర్ నడిపింది. ‘నా కాల్‌సెంటర్ బాగా నడుస్తున్నా నేను చేయాల్సిన పని ఇది కాదే అనిపించేది’ అంది సుచేత. ఆలోచన మెరిసింది పూణెలో కాల్ సెంటర్ పని చేస్తున్నప్పుడు సుచేత తరచూ రకరకాల బృందాలతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లేది. ‘ఆ సమయంలో ఇష్షో బుష్షో అనకుండా చలాకీగా నేనొక్కదాన్నే ఉండేదాన్ని. మిగిలినవాళ్లు తొందరగా అలసిపోయేవాళ్లు. చమటలు కక్కేవాళ్లు. నేను హాయిగా ఎంత దూరమైనా నడిచేదాన్ని. ఎందుకిలా అని ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి నేను తిన్న హెల్దీ తిండి అనిపించింది. నీ జీవితంలో జరిగేది నువ్వు ఎలాగూ మార్చలేవు... కానీ నీ కడుపులో పడేదాన్ని మార్చగలవు అనుకున్నాను. వెంటనే ఊరికి వచ్చి రాగి లడ్డూల తయారీ మొదలెట్టాను. ఆరోగ్యకరమైన చిరుతిండ్లు తయారు చేసి అమ్ముదామని నిశ్చయించుకున్నాను. పిల్లలు, స్త్రీలు ముఖ్యంగా వీటిని తినాలి’ అంది సుచేత. 2019లో మొదలు ఇంతా చేసి ఈ ఆలోచన వచ్చి ఎంతో కాలం కాలేదు. రెండేళ్ల క్రితమే. అయితే రసాయనాలు లేని పదార్థాలు వాడాలని సుచేత నిశ్చయించుకుంది. బజారులో రాగులు దొరుకుతాయి. అవి మందులు కొట్టి పండించినవి. కాని తనకు సేంద్రియంగా పండిన రాగులు కావాలి. అందుకు సుచేత కొంతమంది రైతులను సంప్రదించి వారిని సేంద్రియ పద్ధతిలో రాగులు పండించేలా ఒప్పించింది. పండాక మార్కెట్ రేటుకు కొంటామని హామీ ఇచ్చింది. ‘మొదలు రైతులకు నమ్మకం కుదరలేదు. నాక్కూడా శ్రమ అయ్యింది. కాని ఇప్పుడు ఐదారు మంది రైతులు నా కోసం పండిస్తున్నారు’ అంది సుచేత. రాగిలడ్లు మరింత బలవర్థకం కావాలంటే ఏం చేయాలని న్యూట్రిషనిస్ట్లను అడిగింది. వారు అవిసె గింజలను సూచించారు. సరే... బాదం, ఎండు ఖర్జూరం ఎలాగూ బలమే. వాటన్నింటిని కలిపి కొలతలు ఖరారు చేసి తన మార్కుతో 5 వేల రూపాయల పెట్టుబడితో లడ్లు తయారు చేసింది. మొదట బంధువులు, స్నేహితులు.. తర్వాత నోటి మాటగా, సోషల్ మీడియా ద్వారా ఆమె రాగి లడ్లు ఫేమస్ అయ్యాయి. ఎర్త్‌పూర్ణ సంస్థ సిబ్బ్బంది ఎర్త్‌పూర్ణ సుచేత భండారే ఈ బలవర్థకమైన తిండ్లను తయారు చేసేందుకు ‘ఎర్త్‌పూర్ణ’ అనే సంస్థను ప్రారంభించింది. అంటే ‘సంపూర్ణభూమి’ అని అర్థం. ‘భూమి నుంచి తీసుకున్నది తిరిగి భూమికి చేరితేనే భూమి సంపూర్ణంగా ఉంటుంది. సహజమైన పద్ధతిలో పండింది సహజమైన విధంగా ఆరగించి ఆ మిగిలిన వృధాను భూమిలో కలవనిస్తే ఆ భూచక్రం సజావుగా ఉంటుంది. కెమికల్స్ ప్రమేయం ఉన్న ప్రతి పని భూమిని అసంపూర్ణం చేస్తుంది’ అంటుంది సుచేత. పర్యావరణ హితమైన, ఆరోగ్యహితమైన ఆహార ప్రచారానికి పని చేస్తున్న సుచేత స్వలాభం భూమిలాభం కలిగేలా చూస్తున్నారు. ఇది చాలామంది గమనించదగ్గ ఫార్ములానే. చదవండి: Health Tips: వేరు శెనగలు, ఖర్జూరాలు, కిస్మిస్లు తరచుగా తింటే... -
లాక్డౌన్: లడ్డు తయారుచేస్తున్న బాలీవుడ్ భామ
-
లాక్డౌన్: ఇంట్లో మలైకా ఏం చేస్తుందంటే!
మలైకా అరోరా.. ఈ పేరు తెలియని వారుండరు. నాలుగు పదుల వయసులోనూ.. తన ఫిట్నెస్తో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. అందం, వర్కవుడ్, రూమర్స్ ఇలా అన్ని విషయాల్లోనూ నిత్యం వార్తల్లో నిలిచే ఈ బాలీవుడ్ భామ ప్రస్తుతం లాక్డౌన్ కాలంలో ఓ కొత్త విషయంతో ఆమె మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌తో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం ఈ కాలాన్ని తమకు నచ్చినట్టుగా ఉపయోగించుకుంటున్నారు. ఇంట్లో చేసే కొన్ని పనులను సోషల్ మీడియా రూపంలో అభిమానులతో పంచుకుంటున్నారు. (సరదా కోసం కాదు.. ఇది మన బాధ్యత) నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు లాక్డౌన్ వల్ల ప్రస్తుతం ఇంట్లో పనులను తప్పని సరిగా చేస్తున్నారు. వంట చేయడం, వర్కవుట్లు, ఇంటిని శుభ్రపరచడం, నిద్రించడం, కుటుంబంతో గడపడం, ఇలాంటి పనులతోనే సరిపోతుంది. తాజాగా 46 ఏళ్ల మలైకా తన సమయాన్ని లడ్డులు తయారు చేయడానికి ఉపయోగించుకుంటుంది. బుధవారం ఇంట్లో తీరిగ్గా లడ్డుల తయారీ చేస్తూ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మలైకా అభిమానులు కాస్తా నొచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ హట్ లుక్‌లో కనిపించే మలైకా ఇప్పుడు ఆంటీలాగా కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. (మలైకా తల్లి పుట్టిన రోజు వేడుకలో అర్జున్) View this post on Instagram Dear All, Sarva's and DIVA yoga’s vision is to connect 7 billion breaths. The health and safety of this community is our top priority coming from the birth place of yoga, India. While everyone is spending most of their time indoors, we intent on making yoga accessible, easy and fun. We have over 2000 live sessions happening in SARVA and DIVA in this month. We have separately started 75 live sessions in this month for free for the people in ITALY! As a yoga based wellness company, we definitely can't ignore the changing conditions that the world is currently going through and we want to ensure we give our 100% effort in making the smallest difference that we can. Help us spread the word to friends, family and those in need. We believe that everybody should have access to immunity supporting, stress reducing practices and the opportunity to take care of their health and well being- Physically, mentally and emotionally. To book your live classes slots, *log onto live.sarva.com or check out @thedivayoga Instagram handle* and begin your practice. We take in only 15 participants per session on live.sarva.com as we would like to give personal attention to everybody but on the live classes on Instagram, we have had over 20,000 people attending it. So, please spread this and let’s make a difference in people’s lives. Signing off, Malaika Arora Co founder - SARVA and Diva Yoga. A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on Mar 24, 2020 at 8:21pm PDT View this post on Instagram I love to cook! I love cooking for my family and friends but with my busy schedule, I hardly get time to pursue this passion of mine. But with this self isolation upon us, I thought of utilising this time in a constructive and healthy way by cooking some sumptuous and delicious 'Malabari veg stew for the soul'. I have got this recipe from mom @joycearora and a bit from my friend Maunika @cookinacurry who's a lovely cook. Everyone at home simply loves this stew and we are going to have it with some white rice and some delicious gluten-free, vegan chickpea bread that my friend Raveena @iamayogisattva made for me. M in for a lovely treat, I hope you too utilise this time to do something positive and healthy. Stay calm and stay safe! #stayhome#quarantine #covid_19 A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on Mar 20, 2020 at 10:20pm PDT -
గిన్నిస్ బుక్‌లోకి ‘శ్రీభక్తాంజనేయ’ లడ్డూ
వరుసగా ఐదోసారి ప్రపంచ రికార్డు తాపేశ్వరం(మండపేట): తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని శ్రీభక్తాంజనేయ స్వీట్ స్టాల్ తన పాత రికార్డులను తిరగరాసింది. భారీ లడ్డూ తయూరీతో వరుసగా ఐదోసారి గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ వివరాలను సంస్థ అధినేత సలాది శ్రీనుబాబు సోమవారం విలేకరులకు తెలిపారు. వినాయక చవితి వేడుకల సందర్భంగాఆర్డర్లపై 2011లో 5,570 కేజీలు, 2012లో 6,599 కేజీలు, 2013లో 7,132 కేజీలు, 2014లో 7,858 కేజీల లడ్డూలు తయారుచేసి వరుసగా నాలుగేళ్లపాటు గిన్నిస్ రికార్డులు నెలకొల్పామన్నారు. ఈ ఏడాది విశాఖ నుంచి వచ్చిన ఆర్డరు మేరకు 8,369 కేజీల లడ్డూ తయారీ ద్వారా ఐదోసారి గిన్నిస్ రికార్డు సాధించినట్లు చెప్పారు. 2016 వినాయక చవితి వేడుకల కోసం భారీ లడ్డూలు తయారుజేసి రెండు గిన్నిస్ రికార్డులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
మూతి కరిచిన లడ్డు
అది ఓ శుభదినం. ఇంట్లో పండుగ వాతావరణం. ఉన్నమాట చెప్పాలి కదండీ! మా ఆవిడ లడ్డూలు చేస్తోంది, పక్కింటివారికి కూడా నోరూరేట్టు. ఆ రోజు లడ్డూ తయారీకి సరంజామా సిద్ధం చేసింది. సెలవు దినమైతే నేనూ ఉడత సాయం చేసేవాణ్నే. కానీ ఆ రోజు పనిదినం మూలాన ఆఫీసుకి వెళ్లిపోయాను. తిరిగొచ్చేసరికి సాయంకాలమైంది. ఇంట్లో కాళ్లు పెట్టేసరికి ఒకటే ఘుమఘుమలు దేవుడి గదిలోంచి ముక్కుని తాకుతున్నాయి. ఏ వంట చేసినా మొదట దేవుడికి నైవేద్యం పెట్టే అలవాటు మా ఆవిడది. గబగబా కాళ్లు, ముఖం కడుక్కొని నేరుగా దేవుని గదిలోకెళ్లాను. కొంచెం వెలుతురు, కొంచెం చీకటి. రాత్రి కాలేదు. కాబట్టి ఇంకా లైట్లు వెయ్యలేదు. ఆ సంధ్య చీకట్లో ఒక లడ్డూ తీసుకుని అమాంతం నోట్లో వేసుకున్నాను. టేస్టు మాట దేవుడెరుగు, నోటి నిండా చీమలు, మూతి నిండా చీమలు. ఒకటే కరవడం. పెదవులు, బుగ్గలు, మూతి ఒకటే మంట! ఈ హఠాత్పరిణామానికి ఉక్కిరిబిక్కిరై హాల్లోకి వచ్చేశాను. మా ఆవిడ, పిల్లలు అంతా నాకేమైందోనని గాబరాపడ్డారు. వెంటనే లైటు వేశాక అసలు పరిస్థితి అర్థం చేసుకొని అంతా నవ్వుకున్నారు. ఆ స్పాట్లో నాకు నవ్వు అస్సలు రాలేదు. కాని ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పుడు మాత్రం నవ్వొస్తుంది. - సీహెచ్ సింహాచలం శ్రీకాకుళం