భూ అయస్కాంత క్షేత్రంపై కొనసాగుతున్న పరిశోధనలు
చౌటుప్పల్: ‘ భూమి అంతు చిక్కని ఓ అద్భుతం.. అతిపెద్ద అయస్కాంత క్షేత్రం. మానవజాతి మనుగడను ఈ అయస్కాంత క్షేత్రం గోడలా పరిరక్షిస్తుంది.. అందుకే ప్రపంచవ్యాప్తంగా నిత్యం భూ అయస్కాంత క్షేత్రాలపై 150 కేంద్రాలు పరిశోధనలు సాగిస్తున్నాయి’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెంలోని ఎన్‌జీఆర్‌ఐ క్షేత్రంలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ జియోమాగ్నటిజమ్ అండ్ ఎరోనమీ (ఐఏజీఏ) నిర్వహిస్తున్న 16వ అంతర్జాతీయ అబ్జర్వేటరీ వర్క్‌షాప్ గురువారం మూడో రోజుకు చేరింది. 50మంది దేశవిదే శాల శాస్త్రవేత్తలు పరిశోధనల్లో పాల్గొన్నారు.
పరిశోధనల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిల్లర్స్‌పై మాగ్నటోమీటర్లను ఏర్పాటు చేసి, పరిశోధనలు సాగించారు. వేరియోమీటర్ ద్వారా సంగ్రహించిన భూ అంతర్భాగంలోని నమూనాలను కంప్యూటర్ల ద్వారా విశ్లేషించారు. శాస్త్రవేత్తలందరి పరిశోధన విషయాలను మార్పిడి చేసుకొని, కచ్చితత్వానికి వచ్చారు. కార్యశాల కో-కన్వీనర్ డాక్టర్ కుసుమితా అరోరా, ప్రోగ్రాం ఇన్‌చార్జి డాక్టర్ బి.వీణాధరి, కె.చంద్రశేఖర్‌రావు పరిశోధనలను పర్యవేక్షించారు.
భూమి అంతు చిక్కని ఓ అద్భుతం
Published Fri, Oct 10 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM
Advertisement