లాంగ్వేజ్ పండిట్ సర్టిఫికెట్ల పరిశీలనకు 96 మంది అభ్యర్ధులు హాజరై సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకున్నారు.
96 మంది హాజరు
బొమ్మూరు (రాజమండ్రి రూరల్) : లాంగ్వేజ్ పండిట్ సర్టిఫికెట్ల పరిశీలనకు 96 మంది అభ్యర్ధులు హాజరై సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకున్నారు. గురువారం బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణా సంస్థ(డైట్) లో హిందీ, తెలుగు లాంగ్వేజ్ పండిట్ సర్టిఫికెట్ల పరిశీలన జరి గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులకు సర్టిఫికె ట్ల పరిశీలన జరిపి, ఫీజు చెల్లింపుల అనంతరం డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎం జయశ్రీ కళాశాల ఎలాట్‌మెంట్ లెటర్‌ను అందజేశారు. డైట్ కళాశాల నుంచి ఫీజు చెల్లించేందుకు మీసేవా కేంద్రాలకు వెళ్లడానికి అభ్యర్థులు కొంత ఇబ్బంది పడ్డారు.