అలుపెరుగని సమైక్యాంధ్ర ఉద్యమం
Published Thu, Oct 17 2013 3:34 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
ఏలూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఎన్జీవోలు, రైతులు, వివిధ వర్గాల ప్రజలు కొనసాగిస్తూనే ఉన్నారు. 78వ రోజైన బుధవారం ఏలూరు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెలో సమైక్యవాదులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ఎన్జీవో శిబిరంలో శ్రీశ్రీ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, డీంహెచ్‌వో, కలెక్టరేట్ సిబ్బంది దీక్ష చేపట్టారు. జెడ్పీ కార్యాలయం వద్ద దీక్షలో కూర్చున్న ఉద్యోగులు సోనియాగాంధీ,
సీమాంధ్ర కేంద్ర మంత్రుల మాస్క్‌లు ధరించి సోనియాగాంధీ నుంచి పదవులను భిక్ష తీసుకుంటున్నట్లు వ్యంగ్య ప్రదర్శన నిర్వహించారు. సీమాంధ్ర మంత్రులు గతి ఇంతేనంటూ ఉద్యోగులు తమ ప్రసంగాల్లో నిప్పులు చెరిగారు. పోలవరంలో రిలే దీక్షలో ఏఎన్‌ఎంలు, నర్సులు పాల్గొన్నారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో, తాడేపల్లిగూడెంలో జ్యుడీషియల్, నాన్‌పొలిటికల్, ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. నాన్‌పొలిటికల్ జేఏసీ శిబిరంలో కూరగాయల వ్యాపారులు దీక్ష చేపట్టారు.
యలమంచిలి మండలం దొడ్డిపట్లలో దీక్షలు కొనసాగుతుండగా పోడూరు మం డలంలో సమ్మెలో పాల్గొంటున్న చిరుద్యోగులకు ఆర్డీవో జె.వసంతరావు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తణుకు, అత్తిలి, దువ్వలో రిలేదీక్షలు కొనసాగుతున్నా యి. తణకు జేఏసీ శిబిరంలో హాస్టల్ వార్డెన్లు దీక్షలో కూర్చున్నారు. నరసాపురం జేఏసీ శిబిరంలో రిలే దీక్ష లో యర్రంశెట్టి లక్ష్మణరావు, యర్రంశెట్టి దుర్గారావు, వేణుగోపాలస్వామి తదితరులు కూర్చున్నారు. బస్టాండ్ సెంటర్‌లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో టీవీ సత్యవతి, కె.నాగలక్ష్మి, పి.నాగమణి,తదితరులు కూర్చున్నారు. పలువురు వారికి సంఘీభావం తెలిపారు.
Advertisement
Advertisement