విజయవాడ : వచ్చే మార్చినాటికి అన్ని జిల్లాల్లో ఎల్.ఇ.డి. బల్బుల పంపిణీ పూర్తిచేస్తామని ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్. సీఎండీ హెచ్.వై.దొర చెప్పారు. మంగళవారం ఆయన విజయవాడలో విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలి దశలో గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 57 లక్షల బల్బులు పంపిణీచేశామన్నారు. ఇందువల్ల 349 మెగావాట్ల విద్యుత్ ఆదా అయిందన్నారు. రాష్ట్రంలో రెండో విడత తొమ్మిది జిల్లాల్లో మరింత కాంతివంతమైన ఎల్.ఇ.డి. బల్బులను కేవలం రూ. 10లకే పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వచ్చే మార్చినాటికి అన్ని జిల్లాల్లో పంపిణీ పూర్తిచేస్తామన్నారు.
విద్యుత్ సరఫరా, అంతరాయం తదితర విషయాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నామన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మాట్లాడుతూ విద్యుత్ పొదుపు, అదనపు విద్యుత్ అనే రెండంచెల వ్యూహంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రానున్న ఐదేళ్లలో సోలార్ ద్వారా 5 వేల మెగావాట్లు, పవన విద్యుత్ ద్వారా 4 వేల మెగావాట్లు, విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాచరణ రూపొందించారన్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో రెండో విడత ఎల్.ఇ.డి. బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ రాజబాపయ్య, స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ.చంద్రశేఖరరెడ్డి, విజయవాడ ఎస్.ఇ. విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మార్చికి అన్ని జిల్లాల్లో ఎల్‌ఈడీ బల్బులు
Published Wed, Aug 26 2015 12:48 AM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM
Advertisement