పాలమూరు ఎత్తిపోతల | Let us wait until December for the bill to set up a separate Telangana state | Sakshi
Sakshi News home page

పాలమూరు ఎత్తిపోతల

Published Sun, Sep 29 2013 4:00 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Let us wait until December for the bill to set up a separate Telangana state

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లు కోసం డిసెంబర్ వరకు వేచి చూద్దాం. పార్లమెంట్‌లో బిల్లును ఆమోదిస్తే విజయోత్సవంలో పాల్గొంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణపై బీజీపీ నిర్ణయం మారదు. పార్టీ నిర్ణయాన్ని అదేపార్టీ ముఖ్యమంత్రి వ్యతిరేకించడం ఎక్కడా చూడలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ పథకంగా గుర్తించి పూర్తిచేస్తాం..
 - బీజేపీ నేత సుష్మాస్వరాజ్
 
  మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి:  మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకప్పుడు ప్ర తిఇల్లు పాలు, మీగడతో కళకళలాడేదని అం దు కే ఈ జిల్లాను పాలమూరు జిల్లాగా పిలిచేవార ని బీజేపీ లోక్‌సభ ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ గుర్తుచేశారు. ప్రస్తుతం జిల్లాలో ఆ పరిస్థితి కనుమరుగై ఎక్కడచూచినా పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రాంతప్రజలు తిరిగి బాగుపడాలంటే పాలమూరు ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేసి ఆదుకోవాల్సిన అవసరం ఉందని, బీజే పీ అధికారంలోకి వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తిచేస్తామని హామీఇచ్చారు.
 
 అంతేకాకుండా గోదావ రి, కృష్ణానదులను కూడా అనుసంధానం చేస్తామన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ‘తెలంగాణ ప్రజాగర్జన’ బహిరంగ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో బిల్లుపెడితే మద్దతిస్తామని..లేకపోతే మరోసారి ఉద్యమం చేపడతామని బీజేపీ లోక్‌సభ ప్రతిపక్ష నేత సుస్మా స్వరాజ్ స్ప ష్టం చేశారు.
 
 తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్ర భుత్వం ఇన్నాళ్లూ మోసం చేసిందని..మరోసారి దగా చేయకుండా సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు ముందడుగు వేయాల న్నారు. తెలంగాణపై కేంద్రప్రభుత్వం, సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుని రెండు నెలలు గడుస్తున్నా ప్రక్రియపై ఒక్కఅడుగు కూడా ముందు కు వేయకపోవడంతో ఇక్కడి ప్రజల్లో సందేహా లు వ్యక్తమవుతున్నాయన్నారు. రెండు నెలల్లో తెలంగాణ ఏర్పాటు సాధ్యమవుతుందని అం దుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఆమోదం తెలిపినా అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని ఇలాంటి పరిస్థితి ఏ పార్టీలోనూ ఉండదని ఎద్దేవాచేశారు.
 
 తెలంగాణపై నిర్ణయం మారదు
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ యూ టర్న్ తీసుకుందని కొన్నిపత్రికల్లో చదివానని, పార్టీ నిర్ణయం పట్ల ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. బీజేపీ దగా కో రు రాజకీయాలు చేయబోదన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఏర్పాటు విషయంలో బీజేపీ నిర్ణయం మార్చుకోబోదని హా మీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడి ఉన్నందునే ఇక్కడి ప్రజలు ప్రత్యేకరాష్ట్రం కోసం ఉద్యమించి సాధించుకున్నారన్నా రు. తెలంగాణ ప్రజాగర్జన విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. జనప్రభంజనాన్ని చూసి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే రీతిలో నాయకుల ప్రసంగాలు కొససాగాయి.
 
 సభ ప్రారంభంలో సుష్మాస్వరాజ్ తెలుగులో మాట్లాడిన తీరు స భికులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నా గం జనార్దన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, బం డారు దత్తాత్రేయ, విద్యాసాగర్, మురళీధర రా వు, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి,  బీ జేపీ జిల్లా అధ్యక్షుడు రతన్‌పాండ్‌రెడ్డి, జేఏసీ చై ర్మన్ కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement