
పాను ప్రాంతాల్లో వెలుగులు నింపేందుకు..
తిరుపతి రూరల్: హుదూద్ తుపాను రాష్ట్రంలో బీభత్సం సృష్టించి పలు జిల్లా ల్లో అంధకారం నింపింది. ఈ నేపథ్యం లో తుపాను ప్రభావిత జిల్లాల్లో వెలుగులు నింపేందుకు డిస్కం నడుం బిగిం చింది. డిస్కం పరిధిలోని 8 జిల్లాల నుంచి వేలాది మంది ఉద్యోగులు తుపా ను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు తరలివెళ్లారు. డిస్కం సీఎండీ హెచ్‌వై దొర ఆధ్వర్యంలో వీరు పనిచేయనున్నారు. 8 జిల్లాల నుంచి 2500 మంది ఆపరేషన్, మెయిన్‌టెనెన్స్ సిబ్బంది ఇప్పటికే బస్సుల ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలకు పంపినట్లు డిస్కం సీఎండీ హెచ్‌వై దొర తెలిపారు.
డిస్కం డెరైక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్ రాంసింగ్, డెరైక్టర్ ఆఫ్ హెచ్‌ఆర్ డి.నాగేశ్వరరాజులు సహా య పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆది వారం సాయంత్రం తిరుపతి సర్కిల్ నుంచి సూపరింటెండెంట్ ఇంజనీర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో 270 మంది జెఎల్‌ఎంలు, ఏఎల్‌ఎంలు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, ఏఇలు, ఏడీఇలు ఆపరేషన్, మెయిన్‌టెనెన్స్ సిబ్బంది 8 బస్సుల్లో వైజాగ్‌కు తరలి వెళ్లారు. ఎస్‌ఇ సుబ్బరాజు పచ్చజెండాను ఊపి బస్సులను పంపారు.
వారం రోజుల పాటు తుపాను ప్రభావిత ప్రాంతాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న సబ్‌స్టేషన్‌ను వీరు మరమత్తులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే చీఫ్ ఇంజనీర్ అనంత్‌కుమార్ వైజాగ్‌లో ఉండి పర్యవేక్షిస్తున్నారని ఆయన వివరించారు.