ఆర్వోబీకి లైన్ క్లియర్ | line clear to rob | Sakshi
Sakshi News home page

ఆర్వోబీకి లైన్ క్లియర్

Published Fri, Mar 7 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

line clear to rob

 మట్టెవాడ, న్యూస్‌లైన్ :
 వరంగల్ రైల్వేగేటుపై వై ఆకారంలో నిర్మించే ఆర్వోబీ (రైల్ ఓవర్ బ్రిడ్జి)కి లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు బ్రిడ్జి నిర్మాణంపై ఉన్న కేసును గురువారం హై కోర్టు కొట్టివేసింది. ఆర్వోబీ వల్ల నష్టపోతున్నామంటూ పరిహారం చెల్లించడంతోపాటు బ్రిడ్జి డిజైన్ మార్చాలని బట్టలబజార్, బీటు బజార్ వ్యాపారులు హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసింది. దీని వల్ల బ్రిడ్జి నిర్మాణం నిమిత్తం అటు బీటు బజార్, ఇటు కరీమాబాద్ వైపు పిల్లర్ల కోసం గోతులు తీసిన తర్వాత పనులు ఆగిపోయాయి. సుమారు 15 నెలలుగా పనులు జరగకుండా ఉండడం తో అండర్ రైల్వేగేట్, కరీమాబాద్ రోడ్డులో ప్రయాణం సాగక ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీటు బజార్ వైపు గుంతలో పడి ఒకరు, కరీమాబాద్ వైపు తీసిన గుంతలో పడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. వందలాది మంది ప్రయాణికులు, పాదచారులు గుంతల్లోపడి గాయాలపాలయ్యా రు. ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైంది.
   
 మూడు వైపులా ఆర్వోబీ పనులు
 వరంగల్ రైల్వేగేటు నుంచి బీటు బజార్, కరీమాబాద్, ఖమ్మం రోడ్ వైపు వై ఆకారంలో నిర్మించే బ్రిడ్జి కోసం 60కోట్లు మంజూరయ్యాయి. అందులో బ్రిడ్జి నిర్మాణానికి 28కోట్లు, ఆస్తులు కోల్పోయిన వారికి 32 కోట్లు ప్రభుత్వం కెటాయిం చింది. ఈ మూడు వైపులా ఎటు 470 మీటర్ల చొప్పున మొత్తం 1410 మీటర్ల మేర ఆర్వోబీ నిర్మాణం జరుగనుంది. బ్రిడ్జి పైన 30 ఫీట్ల వెడల్పు ఉంటుంది.
 
 ఫలించిన పోరాటాలు
 ఎన్నో ఏండ్ల పోరాటాల ఫలితంగా మంజూరైన ఆర్వోబీ పనులు ప్రారంభించిన రెండు నెలలకే ఆగిపోయాయి. బ్రిడ్జి నిర్మాణంపై వ్యాపారులు వేసిన కేసు ఎత్తివేయాలని, పనులు తిరిగి చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆర్వోబీ పరిరక్షణ సమితి కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కలెక్ట ర్, ఆర్‌అండ్‌బీ అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రా లు అందజేశారు. మరో వైపు బీటు బజార్‌లోని పలు హమాలీ, ఆటో ట్రాలీ కార్మికులు సైతం ఆందోళనలు చేపట్టారు. ఒకప్పు డు ఆర్వోబీ వద్దని నిరసన తెలిపిన పలువురు వ్యాపారులు కూడా వ్యాపారాలకు తీవ్ర నష్టం కలుగుతోందన్న విషయం తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్వోబీ నిర్మాణంపై ఉన్న కేసు కొట్టివేయడంతో ప్రజలు, వ్యాపారులు, హమాలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 
 రెండు రోజుల్లో పనులు ప్రారంభం :
 రాజేశ్వర్‌రెడ్డి, డీఈఈ, ఆర్‌అండ్ బీ, వరంగల్
 ఆర్వోబీపై ఉన్న కేసు కొట్టివేశారు. మరో రెండు మూడు రోజు ల్లో పనులు ప్రారంభమవుతాయని ఆర్ అండ్ బీ డీఈఈ రాజేశ్వర్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
 
 కరీమాబాద్‌లో సంబరాలు
 ఆర్వోబీపై కేసు కొట్టివేయడంతో నగరంలోని కరీమాబాద్ చెట్ల వారిగడ్డ వద్ద ఆర్వోబీ పరిరక్షణ సమితి కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో గురువారం బానాసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ న్యాయదేవత ప్రజల పక్షం ఉన్నందునే ఆర్వోబీపై వేసిన కేసు కోట్టి వేయబడిందని, పనులు వెంటనే పారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 కార్యక్రమంలో గోనె రాజయ్య, ఆవునూరి రామ్మూర్తి, మాటిశెట్టి మురళి, క్యాతం రాజేందర్, కోరె సుభాష్, వంటల మల్లమ్మ, రమాదేవి, లక్క న ర్సింగం, దస్తగిర్, కాలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.  
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement