సింగపూర్లో ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలు
నవంబర్ 5, 6 తేదీల్లో నిర్వహణకు ఏర్పాట్లు: యార్లగడ్డ
విశాఖపట్నం : ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలను నవంబర్ 5, 6 తేదీల్లో సింగపూర్‌లో నిర్వహించనున్నట్టు లోక్‌నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వంగూరి ఫౌండేషన్ అధ్యక్షుడు వంగూరి చిట్టన్‌రాజు తెలిపారు. వారు బుధవారం విలేకరులతో మాట్లాడారు. లోక్‌నాయక్ ఫౌండేషన్, వంగూరి ఫౌండేషన్, సింగపూర్ తెలుగు అసోసియేషన్, మలేషియా తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మహాసభలకు.
భారత్‌తోపాటు హాంకాంగ్, మలేసియా, థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా, సింగపూర్, మయన్మార్ దేశాల్లోని సాహితీవేత్తలు పాల్గొంటారన్నారు. వివిధ దేశాల్లోని తెలుగు రచయితలు, సాహితీవేత్తలను ఒక వేదికపైకి తీసుకురావడమే ఉద్దేశమన్నారు. తెలుగుభాషపై మక్కువ గలవారిని, సాహితీవేత్తలను ఈ సభలకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. వివరాలకు vangurifound ation@gmail.com వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు.