షాకులిస్తున్న లోకేశ్‌ సభ్యత్వం | Lokesh membership was shoking to many | Sakshi
Sakshi News home page

షాకులిస్తున్న లోకేశ్‌ సభ్యత్వం

Published Sun, Apr 2 2017 1:30 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

షాకులిస్తున్న లోకేశ్‌ సభ్యత్వం - Sakshi

షాకులిస్తున్న లోకేశ్‌ సభ్యత్వం

సాక్షి ప్రతినిధి, కడప: సి.రామచంద్రయ్య తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు. 30ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉంది. టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్‌ పార్టీల్లో కీలక నేతగా వెలిగారు. ఈయనకు టీడీపీ సభ్యత్వ నమోదు కల్పించారు. కడప నగరంలో ఆయన ఉంటున్న వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ ఉషారాణి భర్త సూర్యనారాయణరావు, ఆయన సోదరుడు అశ్వర్థనారాయణకూ టీడీపీ సభ్యత్వాలు వచ్చాయి. ఇక పలువురు జర్నలిస్టులు, సామాన్యులకూ సభ్యత్వాలు జారీ చేశారు. రామచంద్రయ్య, తదితరుల ప్రమేయం ఏమాత్రం లేకుండానే టీడీపీ సభ్యత్వం నమోదు కావడం వెనుక, ఓటర్ల జాబితానే  ఆధారంగా ఉన్నట్లు తెలుస్తోంది.

  పింఛనుదార్లనుంచి బలవంతంగా రూ.100 వసూలు చేసి సభ్యత్వం కట్టబెట్టారు. ఈ వ్యవహారం అప్పట్లో పత్రికల్లోనూ  వచ్చింది. అయినా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకుంటూ ఓటరు లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరికీ సభ్యత్వం జారీచేసి టీడీపీకి కోటిమంది సభ్యులున్నారంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఆ డొల్ల సభ్యత్వాలు చేర్పించడాన్నే అర్హతగా చూపి సీఎం తనయుడు నారా లోకేశ్‌కు ఎమ్మెల్సీ, మంత్రి పదవులు అప్పగించడం టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహంలో భాగమేనని పరిశీలకులు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement