పేలవంగా నారా లోకేష్ రోడ్ షో | Lokesh poorly Road Show | Sakshi
Sakshi News home page

పేలవంగా నారా లోకేష్ రోడ్ షో

Published Sun, Apr 13 2014 2:17 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

పేలవంగా నారా లోకేష్ రోడ్ షో - Sakshi

పేలవంగా నారా లోకేష్ రోడ్ షో

సాక్షి, విజయవాడ/పామర్రు, న్యూస్‌లైన్ : తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ రాజకీయ ప్రచార అరంగేట్రం పేలవంగా జరి గింది. శనివారం సాయంత్రం నాలుగున్నర గంట లకు నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలదండవేసి లోకేష్  రోడ్ షో ప్రారంభించారు. పామర్రు మీదగా గుడివాడకు రోడ్‌షో సాగింది. గుడివాడలో ఆయన ప్రసంగం జరిగే సమయానికి  కనీసం  రెండువేల మంది కార్యకర్తలు కూడా హాజరుకాలేదు.  

లోకేష్ ప్రసంగం జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే పథకాల గురించి ఆయన చెబుతుంటే ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో లోకేష్ కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే తన ప్రసంగాన్ని ముగించారు.  నిమ్మకూరులో నారా లోకేష్ తొలిసారిగా పార్టీ జెండా ఎగురవేయగా అపశ్రుతి చోటుచేసుకుంది. జెండాని ఎగురవేయగా తలకిందులుగా అమర్చినట్లు గుర్తించి సరిచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement