
ఇండోనేషియా నోటుపై గణపతి బొమ్మ
అమలాపురం :మనం తొలిపూజ చేసే గణపతికి మనదేశంలోనే కాక ఇండోనేషియాలోనూ గణనీయమైన ‘గుర్తింపు’ ఉంది. ఆ దేశం విడుదల చేసిన 20 వేల రూపయా నోటుపై ఒకవైపు గణపతి బొమ్మను, ఆదేశ స్వాతంత్య్ర పోరాట యోధుడు, అక్కడి విద్యావ్యవస్థకు పునాది వేసిన కిహజర్ దేవాంతరాని బొమ్మను, మరోవైపు విద్యావ్యవస్థను ముద్రించింది.
ఆ దేశంలో హిందువులు కేవలం 1.7 శాతం మాత్రమే ఉండగా ఆ దేశంలో అంతర్భాగమైన బాలి ద్వీపంలో మాత్రం సుమారు 84 శాతం హిందువులు ఉన్నారు. ఆ నోటుని అమలాపురం ఎస్‌బీఐ బ్రాంచ్ సీనియర్ అసిస్టెంట్‌ఇవటూరి రవిసుబ్రహ్మణ్యం సేకరించారు.