
లారీని ఢీకొన్న కారు: నలుగురు మృతి
గుంటూరు: ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ సహా నలుగురు వ్యక్తులు మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొల్లకొండ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఇండికా కారు కొల్లకొండ దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది.
మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.