నాయుడుపేటటౌన్ (సూళ్లూరుపేట): చిత్తూరు జిల్లా ఏర్పేడులో 15 మంది మృతికి కారణమైన లారీ ప్రమాదం కేసులో నిందితులైన లారీ యజమాని తంబిశెట్టి రమేశ్‌తో పాటు పరారీలో ఉన్న క్లీనర్ సుబ్రమణ్యంను నాయుడుపేట పోలీసుల చొరవతో చిత్తూరు జిల్లా పోలీసులు శనివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. నాయుడుపేటలో నివాసముంటున్న రమేశ్ లారీకి దొరవారిసత్రం మండలం అక్కరపాకకు చెందిన గురవయ్య డ్రైవర్‌గా, అదే గ్రామానికి చెందిన సుబ్రమణ్యం క్లీనర్‌గా ఉన్నారు.
ఈ నెల 21న ఏర్పేడు వద్ద జరిగిన ప్రమాదంలో లారీలో డ్రైవర్ గురవయ్యతో పాటు క్లీనర్ సుబ్రమణ్యం కూడా ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ప్రమాదం జరిగిన రోజే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ గురవయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురవయ్యకు లైట్ వెహికల్ లైసెన్సు మాత్రమే ఉండటంతో ఇందుకు బాధ్యుడిని చేస్తూ లారీ యజమానితో పాటు పరారీలో ఉన్న క్లీనర్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వీరిద్దరినీ శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో..లారీ యజమాని, క్లీనర్
Published Mon, Apr 24 2017 1:34 AM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM
Advertisement
Advertisement