సాక్షి, హైదరాబాద్: హెల్త్ కార్డుల కోసం వివరాలు నమోదు చేసుకోవడంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడం లేదు. డిసెంబర్ 31వ తేదీలోగా ఠీఠీఠీ.్ఛజిజ.జౌఠి.జీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని హెల్త్ కార్డులు పొందాలని, లేదంటే 2014 జనవరి 1 నుంచి ఎలాంటి ఆరోగ్య సంరక్షణ పథకం వర్తించదని, మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఉండదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అరుుతే ఉద్యోగులు, పింఛనుదారులు వివరాలను నమోదు చేసుకోవాలంటే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం గత నెల 4వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సవరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. అయినా ప్రభుత్వం స్పందించలేదు. మరోవైపు ప్రభుత్వ గడువు ముగిసేందుకు మరో 15 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటివరకు సమస్యలు, లోపాలను సవరించని ప్రభుత్వం ఉద్యోగుల నుంచి వారి గ్రేడ్, హోదాలను బట్టి రూ.90 లేదా రూ.120 ప్రీమియంను ఉద్యోగుల డిసెంబర్ జీతం నుంచే కోత విధించేందుకు మాత్రం సిద్ధమైంది.
వీటికి వివరణ ఇవ్వండి: సంఘాలు
రాష్ట్రీకరణ (ప్రొవిన్సులైజ్డ్) అయిన స్థానిక సంస్థల ఉద్యోగులకే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దీంతో మున్సిపల్ ఉద్యోగులకు హెల్త్ కార్డుల వర్తింపుపై అనుమానాలున్నాయి. 010 పద్దు కింద వేతనాలు పొందుతున్న మున్సిపల్ ఉపాధ్యాయులకు కూడా హెల్త్‌కార్డులను వర్తింపజేసే అంశం లేదు. గురుకుల, ఎయిడెడ్, మోడల్ స్కూల్ టీచర్లను హెల్త్ కార్డుల పరిధిలోకి తీసుకురాలేదు. పలు జిల్లాల టీచర్లకు చెందిన డ్రాయింగ్ అండ్ డిస్‌బర్సింగ్ అధికారుల కోడ్‌లు, గ్రేడ్-2 హెడ్‌మాస్టర్లు, క్రాఫ్ట్ టీచర్ల హోదాలు కూడా వెబ్‌సైట్‌లో లేవు వైఎస్సార్, ప్రకాశం, చిత్తూరు తదితర జిల్లాల్లోని టీచర్ల వివరాలు వెబ్‌సైట్‌లో లేనేలేవు. మార్చి 2013 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగుల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరచలేదు. నూతన పింఛను పథకం పరిధిలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేకపోవడంతో నమోదు చేసుకునేందుకు వీలు కావడం లేదు. ఆధార్ కార్డు లేని వారు నమోదు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ఉద్యోగి సర్వీసు రిజిస్టర్‌లో ఉన్న పేరుకు ఆధార్ కార్డులోని పేరుకు తేడాలుంటే నమోదు కావడం లేదు. సర్వీసు రిజిస్టర్, ఐడీ కార్డు నంబర్లు లేని ఉద్యోగులు నమోదు చేసుకునే అవకాశం లేకుం డాపోయింది. ఈలోపాలను సవరించడంతో పాటు వివరణ ఇచ్చాకే హెల్త్ కార్డుల పథకం వర్తింపునకు చర్యలు చేపట్టాలని పీఆర్‌టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, వైఎస్సాఆర్‌సీ టీఎఫ్ విజ్ఞప్తి చేశాయి.
హెల్త్‌కార్డు నమోదులో ఇబ్బందులెన్నో!
Published Mon, Dec 16 2013 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement
Advertisement