కమలం కలవరం
గెలిచే అవకాశాలున్న సీట్లపై టీడీపీ కన్ను
బలహీన స్థానాలు బీజేపీకి అంటగ ట్టాలని వ్యూహం
ససేమిరా అంటున్న ‘కమలం’ నేతలు
పొత్తు వ్యవహారం బీజేపీ, టీడీపీల్లో గందరగోళానికి దారి తీసింది. ఏ నియోజక వర్గం ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ ఆ రెండు పార్టీల్లోనూ ఉంది. మోడీ గాలి బలంగా వీస్తుండడంతో లబ్ధి పొందాలని టీడీపీ భావిస్తోంది. తాము గెలవలేని స్థానాలను బీజేపీకి అంటగట్టాలని చూస్తోంది. దీన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కోరిన సీట్లు ఇవ్వకపోతే ఒప్పుకునేది లేదని నిర్మొహమాటంగా చెబుతున్నారు.
విశాఖపట్నం, న్యూస్‌లైన్: పొత్తుతో లాభం పొందాలి. గెలిచే అవకాశాలున్న సీట్లనే దక్కించుకోవాలి. బలహీనంగా ఉన్న స్థానాలను బీజేపీకి కేటాయించాలి...ఇదీ టీడీ పీ వ్యూహం. దీని వల్లే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కి రావడం లేదని తెలిసింది. ఎన్నికలు సమీపిస్తున్నా ఆ రెండు పార్టీల నేతలు ముందుకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయో తెలియక ఆయా పార్టీల కార్యకర్తల్లోనూ ఆందోళన నెలకొంది.
రెండు పార్టీల పొత్తు వ్యవహారానికి బుధవారం డెడ్‌లైన్ పెట్టుకున్నా పొత్తు చర్చలు ఫలవంతం కాకపోవడంతో ఈ అనిశ్చితికి టీడీపీయే కారణమంటూ బీజేపీ నేతలు రగలి పోతున్నారు. మోడీని చూపించి ఎన్నికల్లో ల బ్ధి పొందాలని టీడీపీ చూస్తూ తమను మా త్రం సీమాంధ్రలో అణగదొక్కాలని చూస్తోం దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభజన తర్వాత కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరడాన్ని చూసుకుని తమను తక్కువగా అంచనా వేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. తాము కోరిన సీట్లను టీడీపీ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.
సీట్ల మార్పులకు అస్సలు ఒ ప్పుకోబోమని చెబుతున్నారు. జిల్లాకు సం బంధించి విశాఖ పార్లమెంటు నియోజక వ ర్గంతో పాటు విశాఖ ఉత్తర, గాజువాక, పాడే రు అసెంబ్లీ నియోజక వర్గాలపై ఆశలు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా ఈ నియోజక వర్గాల్లో బలమైన అభ్యర్థులను ఎన్నికల్లో నిలి పి గెలిపించుకోవాలని అంటున్నారు.