
సాక్షి, న్యూఢిల్లీ : వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న ప్రజాసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. టీటీడీలో నెలకొన్న వివాదం కేవలం శ్రీవారి నగల సమస్య లేదా శ్రీవారి ప్రాచీన కట్టడాల సమస్యో కాదని వ్యాఖ్యానించారు. శాసనాల్లో ఉన్న నగలకు, టీటీడీలో ఉన్న నగలకు అస్సలు పోలికే లేదని పురావస్తు శాఖకు చెందిన ఒక డైరెక్టర్ చెప్పారని... ఆ నివేదికపై సమాచారం కావాలని ఆర్టీఐ ద్వారా అడిగితే జవాబు చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. టీటీడీలో చెలరేగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ... వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వ సంస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించి సెప్టెంబరు 28ను తుది విచారణ ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ జవాబుదారీగా ఉండటానికి ప్రభుత్వానికి ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పుకోవచ్చన్నారు. ప్రజలు అడిగే అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, టీటీడీకి ఉందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment