మద్దిశెట్టి వేణుగోపాల్, కదిరి బాబురావు
సాక్షి, దర్శి టౌన్ (ప్రకాశం): దర్శి నియోజక వర్గంలో ప్రధాన పోటీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్, టీడీపీ అభ్యర్థిగా కదిరి బాబూరావు మధ్య నెలకొంది. ప్రజాప్రతినిధులుగా ఓటర్ల తీర్పును కోరబోతున్న నేపథ్యంలో అభ్యర్థుల గుణ, గణాలను ప్రజలు ఈ విధంగా చర్చించుకుంటున్నారు.
మద్దిశెట్టి వేణుగోపాల్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
♦ బీ.ఈ, డీఎంఎం, ఎం.బీఏ ఉన్నత విద్యను అభ్యసించారు.
♦ పలు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీలను యూఎస్‌ఏ, సింగపూర్‌లలో నెలకొల్పి, ఉపాధి కల్పిస్తున్నారు.
♦ ఒంగోలు పట్టణంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి.
♦ ప్రజాసేవ చేయాలన్న తపనతో కనిగిరి నియోజక వర్గం పామూరు మండలం లక్ష్మినరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం.
♦ 2019లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో పోటీ.
♦ పనిని పట్టుదలతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేయడం.
♦ మంచి స్వభావం, నచ్చని విషయాన్ని సుతి మొత్తంగా తిరస్కరించడం.
♦ నమ్మిన వారి కోసం ఎందాకైనా పోరాటం చేయడం.
కదిరి బాబురావు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
♦ బీఏ, ఎల్‌ఎల్‌బీ విద్యను అభ్యసించారు.
♦ వజ్రాల, గోల్డ్ ముత్యాల వ్యాపారిగా ప్రసిద్ధి
♦ ఎన్‌టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుంచి బాలక్రిష్ణతో కలసి ప్రచార కార్యక్రమాలు పాల్గొనేవారు. 1987లో సీఎస్‌పురం ఎంపీపీగా, 2004లో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ దక్కించుకున్నా సరే నామినేషన్ సక్రమంగా లేక పోవడంతో పోటీకి అనర్హడిగా మిగిలిపోయి ఇండిపెండెంట్‌కి మద్దతు ప్రకటించారు. 2014లో కనిగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
♦ కనిగిరి సీఎస్‌పురం మండలాల్లో ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలకు స్థలాలు దానం
♦ తల్లిదండ్రుల పేరిట పేదలకు సాయం
♦ ప్రజలతో మమేకం కాలేక పోవడం
♦ సమస్యలను వినే ఓపిక తక్కువ
♦ తనకు నచ్చిన వారికోసం ఎంత వరకైనా పోరాటం
♦ కనిగిరి నియోజకవర్గంలో కమిషన్‌ల బాబురావుగా పేరు
Comments
Please login to add a commentAdd a comment