kadiri baburao
-
వైఎస్సార్సీపీలో భారీ ఎత్తున చేరికలు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలు.. టీడీపీ, జనసేనలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివిధ జిల్లాల్లో ఆ పార్టీల్లోని కీలక నేతలు, కార్యకర్తలు అధికార వైఎస్సార్సీపీలో చేరారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నమ్మక ద్రోహి అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల, చింతలపూడి చేరిక విశాఖ నగరంలో మంగళవారం మాజీ మంత్రి బాలరాజు (జనసేన), మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్ (టీడీపీ), చింతలపూడి వెంకట్రామయ్య (జనసేన), బాలరాజు కుమార్తె దర్శిని, కుమారుడు భగత్, టీడీపీ నగర వైస్ ప్రెసిడెంట్ గుడ్ల సత్యారెడ్డి దంపతులు, పి.వి. సురేశ్ (జనసేన), వుడా మాజీ డైరెక్టర్ కోరిబిల్లి సురే‹శ్, కొణతాల సుధ, లయన్స్ క్లబ్ చైర్పర్సన్ నిఖిత, తోట రాజీవ్ (టీడీపీ), ఉషశ్రీ (జనసేన)తోపాటు వందలాది మంది టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. -
చంద్రబాబు నమ్మించి మోసం చేశారు
-
వైఎస్సార్సీపీలో చేరిన కదిరి బాబూరావు
సాక్షి, తాడేపల్లి : మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నమ్మించి మోసం చేయడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిట్ట అని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ మాట ఇస్తే మడమతిప్పని నాయకుడు అని అన్నారు. సీఎం జగన్‌పై ఉన్న నమ్మకంతోనే వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు తెలిపారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు కనీసం తనకు చెప్పకుండా దర్శికి పంపి.. బలవంతంగా అక్కడి నుంచి పోటీ చేయించారని గుర్తుచేశారు. బాలకృష్ణ చెప్పిన మాటను చంద్రబాబు పట్టించుకోలేదు. బాలకృష్ణపై అభిమానంతోనే ఇంతకాలం టీడీపీలో కొనసాగనని చెప్పారు. బాలకృష్ణ మంచి వ్యక్తి అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ నాయకులు తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. సీఎం జగన్ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబును చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీడీపీలో మోసపూరిత వైఖరి నెలకొందని విమర్శించారు. బాబుకు అభ్యర్థులు దొరకడం లేదు : రామచంద్రయ్య వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని విమర్శించారు. బీజీలకు రిజర్వేషన్లు రాకపోవడానికి చంద్రబాబే కారణమని అన్నారు. చంద్రబాబుకు నిజాయితీ లేదని మండిపడ్డారు. -
సేవే మద్దిశెట్టి అభిమతం, కమీషన్ల కదిరి
సాక్షి, దర్శి టౌన్ (ప్రకాశం): దర్శి నియోజక వర్గంలో ప్రధాన పోటీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్, టీడీపీ అభ్యర్థిగా కదిరి బాబూరావు మధ్య నెలకొంది. ప్రజాప్రతినిధులుగా ఓటర్ల తీర్పును కోరబోతున్న నేపథ్యంలో అభ్యర్థుల గుణ, గణాలను ప్రజలు ఈ విధంగా చర్చించుకుంటున్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ♦ బీ.ఈ, డీఎంఎం, ఎం.బీఏ ఉన్నత విద్యను అభ్యసించారు. ♦ పలు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీలను యూఎస్ఏ, సింగపూర్లలో నెలకొల్పి, ఉపాధి కల్పిస్తున్నారు. ♦ ఒంగోలు పట్టణంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి. ♦ ప్రజాసేవ చేయాలన్న తపనతో కనిగిరి నియోజక వర్గం పామూరు మండలం లక్ష్మినరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం. ♦ 2019లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో పోటీ. ♦ పనిని పట్టుదలతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేయడం. ♦ మంచి స్వభావం, నచ్చని విషయాన్ని సుతి మొత్తంగా తిరస్కరించడం. ♦ నమ్మిన వారి కోసం ఎందాకైనా పోరాటం చేయడం. కదిరి బాబురావు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ♦ బీఏ, ఎల్ఎల్బీ విద్యను అభ్యసించారు. ♦ వజ్రాల, గోల్డ్ ముత్యాల వ్యాపారిగా ప్రసిద్ధి ♦ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుంచి బాలక్రిష్ణతో కలసి ప్రచార కార్యక్రమాలు పాల్గొనేవారు. 1987లో సీఎస్‌పురం ఎంపీపీగా, 2004లో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ దక్కించుకున్నా సరే నామినేషన్ సక్రమంగా లేక పోవడంతో పోటీకి అనర్హడిగా మిగిలిపోయి ఇండిపెండెంట్‌కి మద్దతు ప్రకటించారు. 2014లో కనిగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ♦ కనిగిరి సీఎస్‌పురం మండలాల్లో ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలకు స్థలాలు దానం ♦ తల్లిదండ్రుల పేరిట పేదలకు సాయం ♦ ప్రజలతో మమేకం కాలేక పోవడం ♦ సమస్యలను వినే ఓపిక తక్కువ ♦ తనకు నచ్చిన వారికోసం ఎంత వరకైనా పోరాటం ♦ కనిగిరి నియోజకవర్గంలో కమిషన్ల బాబురావుగా పేరు -
ఫ్యాను గాలికి సైకిల్ తలకిందులు
సాక్షి, కనిగిరి (ప్రకాశం): నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జోష్ మరింత పెరిగింది. ఫ్యాను గాలికి సైకిల్ తల కిందులవుతోంది. ఏ వీధి చూసినా.. ఏ వాడ చూసినా.. వైఎస్సార్ సీపీ గాలి వేగంగా వీస్తోంది. ప్రత్యర్థి టీడీపీ నేతలు చతికల పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు అధిక సంఖ్యలో చేరుతున్నారు. వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీ వైపు అడుగేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరాత్నాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేశాయి. అకట్టుకున్నాయి. జగన్ ప్రకటించిన నవరత్నాలు క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలకు చేర్చడంలో ఆ పార్టీ అభ్యర్థి బుర్రా మధు సఫలీకృతులయ్యారు. కుటుంబం అంతా ప్రచారంలోనే.. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్థి బుర్రా మధు ప్రజాసమస్యలపై ఇప్పటికే అనేక పోరాటాలు చేశారు. పట్టణంతో పాటు, ఆరు మండలాల్లో ఎక్కడ ప్రజా సమస్య వచ్చినా అధికార పార్టీ నేతలు ఆగడాలు చేసినా వెంటనే అక్కడికి చేరి న్యాయ పోరాటం చేసి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు. నియోజకవర్గంలో బుర్రాకు విపరీతమైన అభిమానం, ఆదరణ పెరిగింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా కుటుంబంతో కలిసి ప్రతి గల్లీ, ప్రతి ఇంటికి బుర్రా కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. అమ్మా, అయ్యా, అక్క, చెల్లి, అవ్వా, తాతా అంటూ ప్రతి ఒటరను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండంటూ కోరుతున్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేయండి.. ఎమ్మెల్యేగా తనను ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని గెలిపించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయండి.. అంటూ ప్రతి ఒక్కరినీ ఓటు అడుగుతున్నారు. బుర్రా మధు, లక్ష్మి దంపతులతో పాటు కుటుంబలోని పిల్లలంతా తలా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని రోజూ రాత్రి వరకు ప్రచారం చేస్తున్నారు. రెట్టించ్చిన ఉత్సాహం బుర్రా నామినేషన్ రోజు వచ్చిన జన ప్రవాహంతో ప్రత్యార్థి పార్టీ సైతం ఆలోచనలో పడింది. పట్టణంలోని వీధులన్నీ జన సంద్రమయ్యాయి. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచార సభకు జనం పోటెత్తారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. నియోజకవర్గంలో వార్ వన్‌సైడ్‌గా మారింది. నిఘా వర్గాలు సైతం కనిగిరి కొండపై వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేయడం ఖాయమంటూ నివేదికలిచ్చాయి. వైఎస్సార్ ప్రభంజనంతో ప్రత్యార్థి పార్టీ అభ్యర్థి ఉక్కిరిబిక్కిరి అయ్యారంటే అతిశయోక్తి కాదు. వైఎస్సార్ సీపీలో టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన వారు వందల సంఖ్యలో వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. పార్టీ నియోజకవర్గ అభ్యర్థి బుర్రా మధు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి నమ్మకం కల్పిస్తూ తానున్నానంటూ భరోసా కల్పిస్తూ అందరి మన్ననలు బుర్రా పొందుతున్నారు. నిరుత్సాహంలో టీడీపీ అభ్యర్థి టీడీపీలో ఒకరిద్దరు చేరినా వైఎస్సార్ సీపీలోకి టీడీపీ సీనియర్ నాయకులు వందల సంఖ్యలో చేరుతుండటంతో టీడీపీ అభ్యర్థి తీవ్ర నిరుత్సాహంలో కొట్టు మిట్టాడుతున్నాడు. టీడీపీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అన్ని సామాజికవర్గాలకు చెందిన వారు టీడీపీకి గుడ్‌బై చెప్తున్నారు. టీడీపీ అభ్యర్థి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నిర్వహించిన ప్రతి సభకు, కార్యక్రమానికి జనం పొటెత్తడం.. ఇంటిలిజెన్స్, నిఘా వర్గాలకు సైతం కనిగిరిలో వార్ వన్‌సైడ్ అంటూ నివేదికలు ఇవ్వడంతో టీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో సైతం డీలా పడిపోతున్నారు. భగ్గుమంటున్న కదిరి వర్గీయులు మరోవైపు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి వర్గీయులు టీడీపీ అభ్యర్థిపై కస్సు బుస్సు మంటున్నారు. కొందరు ఇప్పటికే కనిగిరి వదిలి దర్శి వెళ్లారు. మరికొందరు పార్టీ వదిలి బయటకు వెళ్ల లేక అక్కడే ఉంటూ తీవ్రంగా రగిలిపోతున్నారు. కదిరి టిక్కెట్టును ఉగ్ర లాక్కున్నాడనే ఆక్రోశంతో రగులుతూ కసితో ఉన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కనిగిరిలో జరిగిన సీఎం సభలో కనీసం కదిరి బాబూరావు పేరును కూడా ఆయన పలకరించలేదు. కాపు సామాజికవర్గ నేతలు తీవ్రంగా రగిలిపోతున్నారు. టీడీపీకి కాపు సత్తా చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కదిరికి టిక్కట్టు కనిగిరిలో ఇవ్వక పోవడంతో ఇప్పటికే ఆ సామాజికవర్గం వారు నిరసనలు తెలిపిన సంగతి విదితమే. కనిగిరి టిక్కెట్టు కోసం చివరి వరకు పోరాడిన కదిరి తన టిక్కెట్టును ఉగ్ర లాక్కున్నాడంటూ కార్యకర్తల సమావేశంలో కన్నీటి పర్యాంతమైన విషయాన్ని కదిరి వర్గీయులు మరవలేక పోతున్నారు. కనిగిరి ప్రజలతో బుర్రా మమేకం గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన బుర్రా మధు.. ఐదేళ్ల నుంచి కనిగిరిలోనే నివాసం ఉంటూ అందరి మన్ననలు పొందారు. ఐదేళ్ల నుంచి బుర్రా మధు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలతో పాటు, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరినీ స్వయంగా పలుకరించారు. గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో గ్రామాల్లోని ప్రతి గడప తిరిగి అందరి ఆశీస్సులు బుర్రా పొందారు. అన్ని సామాజికవర్గాల మద్దతు పొంది గెలుపు దశలో దూసుకెళ్తున్నారు. ఇతర పార్టీల వారు సైతం బుర్రా ఎంత కష్టపడుతున్నారు. ఒక్క అవకాశం ఇద్దాం.. అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సైకిల్‌కు పంక్చర్ నియోజకవర్గంలో టీడీపీ రోజురోజుకూ డీలా పడుతోంది. అసమ్మతి నాయకులను మచ్చిక చేసుకోవడంలోనే టీడీపీ నేతలకు సమయం సరిపోవడం లేదు. మరోవైపు వైఎస్సార్ సీపీలో రోజూ వందల సంఖ్యలో టీడీపీ, ఇతర పార్టీల వారు చేరుతున్నారు. ఇప్పటికి టీడీపీకి చెందిన పట్టణంలోని కౌన్సిలర్లు చింతం శ్రీను, కోప్షన్ సభ్యుడు పీర్ల మస్తాన్‌వలి, షీప్ యార్డ్ డైరక్టర్ దేవర వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కాసుల గురవయ్య, సీనియర్ నాయకులు రహిమాన్‌తో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. పీసీపల్లిలో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ప్రజాప్రతినిధి పులి వెంకటేశ్వరరెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. అతనితో పాటు వందలాది మంది పార్టీలో చేరారు. సీఎస్‌పురం మండలంలోని టీడీపీ సినియర్ నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గుంటయ్య, చిట్టిబోయిన వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు ఆలా తిరుపతయ్య, కె.రత్తమ్మ, సర్పంచ్‌లు పులిమి ఆదినారాయణ, సాయమ్మ, కాపు చెంగలయ్యలతో వందలాది మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. వెలిగండ్ల మండలంలో మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయి మీరాకుమారి, గజ్జల నాగేశ్వరరెడ్డి మరికొందరు పార్టీలో చేరారు. పామూరులో తిరుపతయ్య, ఆకుపాటి రమణయ్య, గుంటుపల్లి సుబ్బరాయుడు, మాలకొండయ్య, ఉప్పలపాటి రామాంజనేయులు, ఊసా మధు, చల్లా సుబ్బారావు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు వైఎస్సార్ సీపీలో చేరారు. హెచ్‌ఎంపాడు మండలంలో పాశం పిచ్చయ్య, తాతపుడి బుజ్జి, కాశమ్మ రమణయ్య, నాలి వెంకటేశ్వర్లుతోపాటు వందలాది మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. -
వదల బొమ్మాళీ.. వదల..!
సాక్షి, కనిగిరి (ప్రకాశం): కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు కనిగిరి సీటు విషయంలో సీఎం చంద్రబాబునాయుడు చేదు అనుభవం మిగిల్చారు. దీంతో కనిగిరిలో కదిరితో పాటు ఆయన వర్గీయులు కొద్ది రోజులుగా నిరసన జ్వాలలతో రగిలిపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డిపై పరోక్షంగా అనేక వేదికలపై కదిరి బాబూరావు విమర్శలు గుప్పించిన సంగతి విధితమే. ఒకానొక దశలో తనను కాదని వేరేవారికి టికెట్ ఇవ్వాలంటే పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్న రెడ్డి, కమ్మ, యాదవ, బీసీ కులాల వారు ఉన్నారని, వారిలో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే తాను గెలిపించుకుని వస్తానని కూడా అధిష్టానానికి ఆయన అల్టిమేటం జారీ చేశారు. కానీ, కదిరి మాటను అధిష్టానం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టడంతో పాటు సర్వేల పేరుతో కదిరికి టికెట్ ఇవ్వకుండా తిరస్కరించింది. ఆయన ఎవరినైతే ఘాటుగా విమర్శించి పార్టీలో చేర్చుకోవడానికి వీలులేదంటూ అడ్డుపడ్డారో అతనికే కనిగిరి టీడీపీ టికెట్ ఇవ్వడంపై కదిరి బాబూరావు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఒకదశలో తన స్నేహితుడైన నందమూరి బాలకృష్ణతో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించిన కదిరిని చివరకు దర్శికి కేటాయించారు. పార్టీ కోసం ఐదేళ్లుగా ఎంతో కష్టపడిన తనకు అన్యాయం చేశారంటూ అధిష్టానంపై ఆయన ఆవేదన వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబుకు వయసు మీదపడటంతో మతిభ్రమించి తనకు కనిగిరి సీటు లేకుండా చేశారంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. కదిరి బాబూరావు పాతగాయాలు మానలేదని మండిపాటు... కనిగిరి టీడీపీ టికెట్‌ను ఉగ్ర నరసింహారెడ్డికి ఇవ్వడంతో ఇప్పటి వరకు కదిరి బాబూరావుపైనే అశలు పెట్టుకున్న ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులు, కార్యకర్తలు సైతం ఉగ్ర వద్దకు తాము వెళ్లలేమంటూ ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో తేల్చి చెప్పారు. రోడ్డెక్కి నిరసనలు కూడా తెలిపారు. మరికొందరు టీడీపీ నాయకులైతే.. ఇక కనిగిరిలో టీడీపీ ఔట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. గతంలో ఉగ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు టీడీపీ క్యాడర్‌ను ఇబ్బంది పెట్టినట్టు వారు వాఖ్యానిస్తున్నారు. ఆ పాత గాయాలు తమకు ఇంకా మానలేదంటూ పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా వాఖ్యానిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ఉగ్రను తీవ్రంగా వ్యతిరేకిస్తోందనేది బహిరంగ రహస్యం. ఏది ఏమైనా కనిగిరిని వదిలి కదిరి వెళ్తారా.. లేకుంటే కనిగిరిలోనే పోటీలో ఉంటారా అనేది నామినేషన్ల చివరి రోజు వరకూ ఉత్కంఠకు దారితీయనుంది. కనిగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే యోచనలో కదిరి..? కదిరి బాబూరావు స్వగ్రామమైన శీలంవారిపల్లిలో మంగళవారం నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో కదిరి ఘాటైన విమర్శలు చేశారు. ‘ఉగ్ర నా సీటును లాక్కున్నాడు. ఇంకా ఏం చేస్తాడోనని టీడీపీ కార్యకర్తలంతా భయపడుతున్నారు. అవేంటో నాకు తెలుసు’ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. తాను కార్యకర్తలను వదిలిపోనని.. దర్శిలో తనకు సీటు ఇవ్వడంతో అక్కడ నామినేషన్ వేయడంతో పాటు కనిగిరిలోనూ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తానని ప్రకటించారు. చివరి రోజు వరకూ కనిగిరి స్థానం కోసం పోరాడతానంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఒక దశలో తాను దర్శిలో నిలబడినా ఓడిపోతానని, అదే కనిగిరిలో ఇండిపెండెంట్‌గా వేసినా కనీసం 30 వేల ఓట్లయినా వస్తాయని, అలా చేస్తే ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఉగ్ర దగ్గరికి వెళ్లడానికి కార్యకర్తలు భయపడుతున్నారని, ఆ విషయం తనకు తెలుసని, ఏం చేద్దాం.. పార్టీ మనకు అన్యాయం చేసిందని తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. కదిరి చేసిన ప్రసంగం, అంతర్గత చర్చలు టీడీపీని, ఆ పార్టీ శ్రేణులను ఆలోచనలో పడేశాయి. -
డబ్బులిచ్చిన వారికే టికెట్లు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు నాయుడు వద్ద పార్టీ ఆఫీసులో ఓ కోటరీ ఉంది. ఆ కోటరీని మేనేజ్ చేసిన వారికే తెలుగుదేశం పార్టీ టికెట్లు. ఇవన్నీ డబ్బులతోనే జరుగుతాయి. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. సీటు కావాలంటే ఆ కోటరీని మేనేజ్ చేస్తే చాలని కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు ధ్వజమెత్తారు. కనిగిరి టికెట్ ఆశించి భంగపడిన కదిరి మంగళవారం సీఎస్‌పురం మండలంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీపై ప్రెజర్ తెచ్చేందుకే మీటింగ్ పెట్టానన్నారు. మనమీటింగ్ ఇంటలిజన్స్ దాకా వెళ్లిందన్నారు. ఇప్పుడే చంద్రబాబు అనుచరుల నుంచి ఫోన్ వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇస్తామన్నారు, చంద్రబాబు ఎంతమందికి ఎమ్మెల్సీ, మంత్రి పదవులిస్తారని కదిరి ఎద్దేవా చేశారు. ఐవీఆర్ఎస్ కూడా మేనేజ్ చేస్తున్నారని ఉగ్రనరసింహారెడ్డి పై కదిరి పరోక్ష విమర్శలు చేశారు. ఐవీఆర్ఎస్ వలన చంద్రబాబు నాయుడు భ్రమలో ఉంటున్నాడన్నారు. ఉగ్రనరసింహారెడ్డిని 90 శాతం కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని కదిరి చెప్పారు. మొన్నటి దాకా జనార్దన్ హీరో.. ఆయన పిల్లోడయినా దేవుడిని కూడా లెక్కలేకుండా మాట్లాడాడు. ఆ తరువాత ఆమంచి కృష్ణమోహన్, మాగుంటలకు మంచిసీన్ ఇచ్చారని కదిరి చెప్పారు. వారు వెళ్లిన తరువాత ఇప్పుడు బలరామే హీరో. జిల్లాకి హెడ్ అయ్యాడన్నారు. వయస్సు పైబడడంవల్ల చంద్రబాబు భ్రమల్లో పడి మోసపోతున్నాడన్నారు. బాబు ఎప్పుడూ కంప్యూటర్లు అంటాడు. మనుషులు కన్నా కంప్యూటర్లు ఎక్కువా..చంద్రబాబు నాయుడు పెట్టిన టెక్నాలజీని కొందరు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని కదిరి విమర్శించారు. అది ఆయనకు అర్థం కావడంలేదన్నారు. అదేమంటే నా కంప్యూటర్ చూడు, నా డాష్‌బోర్డు చూడు అంటున్నాడు. ఆ కంప్యూటర్లో ఏముంటుందో ఆ దేవుడికి తప్ప అది ఎవరికి తెలియదని కదిరి చంద్రబాబును ఎద్దేవా చేశారు. బాలకృష్ణ ఉన్నాడు ఇబ్బంది ఉండదనే చేశాను. కానీ చంద్రబాబు నాయుడు దేనికి లొంగాడో తెలియదు. నాకు సీటు ఇవ్వలేదని కదిరి వాపోయారు. నన్ను వద్దంటే రెడ్డి అయినా, కమ్మ అయినా పార్టీలో ఉన్నవారికి ఇవ్వాలని చెప్పానన్నారు. 10 రోజుల క్రితం వచ్చిన వారికి టికెట్టు ఎలా ఇస్తాడన్నారు. 95 శాతం సీట్ల మార్పులు ఉండవన్నారు. 24 దాకా ప్రయత్నం చేస్తా ఇక్కడ కూడా నామినేషన్ వేద్దాం ఇండిపెండెంట్‌గా అయినా సరే అన్నారు. రెండుచోట్ల నామినేషన్లు వేస్తానన్నారు. తాను ఇప్పుడు సీటు వద్దంటే దర్శి వేరేవారికి ఇస్తారని కదిరి చెప్పారు. గతంలో ఓఎస్డీగా పనిచేసిన వెంకయ్య చౌదరి నాకు ఫోన్ చేసి ఉగ్రని గెలిపించాలని చెప్పాడన్నారు. ఒక వేళ టికెట్ ఇచ్చిన చోట అంటే ఓడతామనే దర్శికి వెళ్లాలి... గెలిస్తే కార్యకర్తలకు న్యాయం చేయగలను. గెలవకున్నా పార్టీ లో ఉంటే ఇక్కడ ఉగ్ర నుంచి మీకు ఇబ్బంది ఉండదని అన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయడం కూడా కరెక్టు కాదన్నారు. వేస్తే 30 వేల ఓట్లు కూడా రాకుండా ఓడిపోతే అసహ్యంగా ఉంటుందన్నారు. భయంతో ఉగ్రనరశింహారెడ్డి ఉదయం 8 గంటలకు వెళ్లి కనిగిరి బీఫాం కూడా తీసుకుని వెళ్లిపోయాడన్నారు. శిద్దా సహకరిస్తానంటే దర్శి వెళ్తానని చెప్పారు. -
సబ్బం హరికి అసమ్మతి సెగ
సాక్షి, విశాఖపట్నం: అధికార టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా సబ్బం హరి పేరు ఖరారు చేయడాన్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సబ్బం హరికి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ సీనియర్ నేత కోరాడ రాజబాబుతో సహా పలువురు నేతలు మంగళవారం టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీలో చేరకుండానే అధిష్ఠానం సబ్బం హరికి టికెట్ ఇవ్వడం దారుణమని టీడీపీ నాయకులు వాపోతున్నారు. బాబూరావు గరం గరం కనిగిరి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, కదిరి బాబురావు టీడీపీ అధిష్టానంపై రగిలిపోతున్నారు. పార్టీకి సేవ చేసిన తనను పక్కన పెట్టి టీడీపీకి ఏమాత్రం సంబంధం లేని ఉగ్రనరసింహరెడ్డికి టికెట్ ఇవ్వడంపై మండిపడ్డారు. సొంత నియోజకవర్గాన్ని వదిలి దర్శికి వెళ్లేది లేదని బాబూరావు తెగేసి చెప్తున్నారు. అవసరమయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బాబురావుకి కనిగిరి టికెట్ ఇవ్వాల్సిందే అని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం నివాసం వద్ద నిరసన జ్వాలలు అమరావతిలోని సీఎం నివాసం వద్ద కొనసాగుతున్న నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. మాచర్ల టిక్కెట్ అంజిరెడ్డికి కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు నివాసానికి భారీగా తరలివచ్చి నిరసన చేపట్టారు. అంజిరెడ్డికి సీటు ఇస్తే నామినేషన్ వేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఇస్తే పార్టీ కోసం కష్ట పడిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. -
ఎన్నికలొస్తున్నాయ్.. త్వరగా పని కానిచ్చేయండి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఎన్నికల నొటిఫికేషన్‌కు సమయం ఆసన్నం కావడంతో అధికార పార్టీ నేతలు ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా అభివృద్ధి పనుల జోలికి వెళ్లని చంద్రబాబు సర్కారు ఎన్నికల వేళ వేల కోట్ల రూపాయల పనులకు హడావుడిగా శంకుస్థాపనలు చేస్తోంది. గతంలో శంకుస్థాపనలు చేసిన పనులను పట్టించుకోని ప్రభుత్వం నేడో రేపో ఎన్నికలనగా అన్ని చేసేస్తామంటూ జనాన్ని మభ్యపెట్టే యత్నానికి దిగారు. మార్చి నెల మొదటి వారంలోనే జిల్లా వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల పనులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేశారు. ఇది చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునేందుకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఫలకాల జోరు.. ఒంగోలు నగర పరిధిలో రెండో డివిజన్ కేశవరాజుగుంటలో పోతురాజు కాలువ నుంచి న్యూ హైవే వరకు రూ.2.58 కోట్లతో రోడ్డు విస్తరణ పనులంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. ఐదేళ్లపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా రోడ్డు అభివృద్ధి పనులు ఎందుకు గుర్తుకు రాలేదో ఆయనకే తెలియాలి. రెండో డివిజన్ పరిధిలోని ముక్తినూతలపాడు న్యూహైవే నుంచి ముదిగొండవాగు వరకు మరో రూ.1.07 కోట్లతో రోడ్డు పనులకు సైతం శంకుస్థాపనలు చేశారు. భాగ్యనగర్ 4వ లైను పదో అడ్డరోడ్డులో రూ.2 కోట్లతో కాపు సంక్షేమ భవన్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ.22.40 కోట్లతో కరువది నుంచి గుండాయపాలెం, కరవది నుంచి కొప్పోలు రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. 24వ డివిజన్ సమైఖ్య నగర్లో రూ.30 లక్షలతో సామాజిక భవనానికి శంకుస్థాపన చేశారు. వెంగముక్కల పాలెంలో రూ.10 లక్షలతో కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేయగా వెంగముక్కలపాలెం జంక్షన్ నుంచి భగీరధ కెమికల్ ఫ్యాక్టరీ వరకు రూ.3 కోట్లతో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మొత్తం పనులకు మార్చి 5, 6, 7 తేదీల్లో శంకుస్థాపనలు చేయడం గమనార్హం. ఐదేళ్లపాటు వీటి జోలికి వెళ్లని అధికార పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందేందుకే అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపనల తంతు చేపట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనిగిరిలోనూ ఇదే తీరు.. కనిగిరిలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఎన్నికల శంకుస్థాపనల జోరు సాగిస్తున్నారు. కనిగిరిలో రూ.189 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కనిగిరి తాగునీటి సమస్య ఎమ్మెల్యేకు ఐదేళ్ల పాలనా కాలం చివరిలో గుర్తుకు రావడం గమనార్హం. సీఎస్‌పురం మండలంలో ఆర్అండ్బీ నుంచి బోడావులదిన్నె వరకు రూ.43.93 లక్షలతో తారు రోడ్డు పనికి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇదే మండలంలోనూ పెదరాజుపాలెం నుంచి ఎగువపల్లివరకు రూ.1.35 కోట్లతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా కోనపల్లి నుంచి బోయమడుగులకు రూ.63 లక్షలతో రోడ్డు పనులకు ఎమ్మెల్యే గురువారం శంకుస్థాపన చేశారు. డీజీ పేట నుంచి బొంతువారిపల్లి వరకు రూ.3.60 కోట్లతో తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇదే మండలంలో పలు సీసీ రోడ్లు నిర్మాణాలకు సైతం గత రెండు మూడు రోజుల క్రితం శంకుస్థాపనలు చేశారు. ఇదే మండలంలో బీసీ వసతి గృహ భవన నిర్మాణానికి నాలుగు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే శంకుస్థాపన చేయగా ఈ కార్యక్రమానికి అప్పటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి సైతం హాజరయ్యారు. కానీ ఇప్పటికీ ఆ భవనం నిర్మాణానికి నోచుకోక పోవడం గమనార్హం. పామూరు మండలంలో కంభాలదిన్నె నుంచి రేణుమడుగు వరకు రూ.4.29 కోట్లతో తారు రోడ్డు పనికి ఇటీవలే శంఖుస్థాపన చేయగా రూ.2.72 కోట్లుతో రజాసాహెబ్‌పేట తారు రోడ్డు పనికి, బోడవాడ నుండి అక్కంపేట వరకు రూ.3.05 కోట్లతో తారు రోడ్డు పనికి రూ.1.74 కోట్లతో రేగుచెట్లపల్లి తారు రోడ్డుకు ఎమ్మెల్యే ఇటీవలే శంకుస్థాపన చేశారు. • అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రూ.85 కోట్లతో గుండ్లకమ్మ నుంచి అద్దంకి పట్టణానికి నీరందించే పథకానికి ఇటీవలే శంకుస్థాపన చేశారు. • దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలో మొగలిగుండాల రిజర్వాయర్‌కు మంత్రి శిద్దా రాఘవరావు ఇటీవలే శంకుస్థాపన చేశారు. దొనకొండ మండలంలోని వెంకటాపురంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు, రాగమక్కపల్లిలో చిన్న తరహా పరిశ్రమలకు, దర్శిలో 1000 జీప్లస్2 గృహాలకు ఇటీవల మంత్రి శంఖుస్థాపనలు చేశారు. ఐదేళ్లపాటు వీటిని పట్టించుకోని అధికార పార్టీ ఎన్నికల సమయంలో శంకుస్థాపనలకు దిగడంపై విమర్శలు ఉన్నాయి. • గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం అనుమలపల్లిలో ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి 132/32 కేవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు గురువారం శంకుస్థాపన చేశారు. రెండు నెలలుగా ఈ విద్యుత్ సబ్ స్టేషన్ పనులు మొదలయ్యాయి. గురువారం ఎమ్మెల్యే శంఖుస్థాపన చేయడం గమనార్హం. • పర్చూరు నియోజకవర్గంలో మార్చి 4న కారంచేడులో రూ.3.80 కోట్లతో మంచినీటి పథకానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శంఖుస్థాపన చేశారు. ఫిబ్రవరి 25న రూ.11.45 కోట్లతో యద్దనపూడి మండలంలోని సూరవరపుపల్లి, అనంతవరం, వింజనం పాడు, చిలుకూరివారిపాలెం, యద్దనపూడి, వెన్నవరం గ్రామాల్లో కమ్యూనిటీహాళ్లు, పంచాయతీ భవనాలకు, సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. తొండివాగుపై బ్రిడ్జిలకు శంకుస్థాపనలు చేశారు. ఇంకొల్లులో రూ.40 లక్షలతో అన్నా క్యాంటీన్ కోసం ఇటీవలే శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంకొల్లు చెరువు వద్ద వాకింగ్ ట్రాక్ కోసం రూ.50 లక్షల పనికి శంకుస్థాపన చేశారు. • కందుకూరు నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలో రూ.2 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ వద్ద రూరల్ మండలంలో తాగునీటి సరఫరా కోసం నీటి పథకానికి ఎమ్మెల్యే పోతుల రామారావు శంఖుస్థాపన చేశారు. అలాగే రూ.37 లక్షలతో కందుకూరు పట్టణంలో డ్రైన్‌కు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు పట్టణంలో షాదీఖాన కోసం శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. అధికార పార్టీ హడావుడిపై విమర్శలు.. వాస్తవానికి గత ఐదేళ్లుగా చంద్రబాబు సర్కారు జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులను గాలికి వదిలేసింది. కనిగిరి నిమ్జ్. దొనకొండ పారిశ్రామికవాడలకు ఎప్పుడో శంకుస్థాపనల శిలాఫలకాలు వేశారు. ఇప్పటికి వాటి ఊసులేదు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరిస్తామన్నారు. ఐదేళ్లుగా ఈ హామీ నెరవేరలేదు. గుండ్లకమ్మ ప్రాజెక్టును దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పూర్తి చేయగా మిగిలి ఉన్న 5శాతం పనులను కూడా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. మూడేళ్ల క్రితం జిల్లాకు ట్రిపుల్ ఐటీ మంజూరైనా ఇప్పటికి కనీసం భవనాలు ఏర్పాటు చేసి జిల్లాలో ట్రిపుల్ ఐటీని నడపలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో బాబు సర్కారు ఉండి పోయింది. పాత హామీలను పక్కన పెడితే ఎన్నికల ఏడాదిని దృష్టిలో పెట్టుకుని రామాయపట్నం పోర్టు, ఏషియన్ పేపర్ పరిశ్రమలు నిర్మిస్తామంటూ ఇటీవలే ముఖ్యమంత్రి ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. వాటి నిర్మాణం ఊసేలేదు. అవన్నీ పక్కనపెట్టి తీరా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలో మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు జిల్లాలో వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు హడావిడి చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
చిందులు తొక్కిన బాబూరావు..బాలకృష్ణకు ఫోన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కనిగిరి టికెట్ తనకే కావాలంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు పట్టుబట్టారు. ఉగ్రనరసింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వమంటూ ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదన పెట్టారు. నిర్ణయం తాను ప్రకటిస్తాన్న సీఎం మాటను బాబూరావు పెడచెవిన పెట్టారు. సమావేశం నుంచి అలిగి బయటకు వచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే పార్టీ వదలి వెళతానంటూ చిందులు తొక్కారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణకు ఫోన్ కొట్టాడు. వెంటనే బాలకృష్ణ సీఎం కు ఫోన్ చేసి తాను కలవడానికి వస్తున్నానంటూ సమాచారం పంపారు. బాలకృష్ణ ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చే పక్షంలో ఉగ్రనరసింహారెడ్డిని ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదన పెట్టనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం అమరావతి వేదికగా ఈ రచ్చ సాగింది. వివరాల్లోకి వెళితే... సోమవారం ప్రారంభమైన టీడీపీ ఒంగోలు పార్లమెంట్ సమీక్ష సామావేశానికి కొనసాగింపుగా మంగళవారం అమరావతిలో సీఎం కనిగిరి నేతలతో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కనిగిరి ఎమ్మెల్యే బాబూరావు, మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డిలతో సమావేశమయ్యారు. ప్రారంభంలో ఇద్దరు నేతలు మీ నిర్ణయానికే కట్టుబడిఉంటామంటూ సీఎంకు హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆ మేరకు ఇద్దరూ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇంతలో తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని ఉగ్రనరసింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కదిరి బాబూరావు ముఖ్యమంత్రికి చెప్పారు. ఇప్పుడే తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి ఇంతలోనే మాట మారిస్తే ఎలా అని సీఎం కదిరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అన్ని రకాలుగా పరిశీలించి రెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆ నిర్ణయానికే ఇద్దరూ కట్టుబడి ఉండాలని సీఎం ఖరాఖండిగా చెప్పారు. సీఎం వాలకం చూసి కనిగిరి టికెట్ ఇవ్వడన్న అనుమానంతో కదిరి వేగంగా స్పందించారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందేనంటూ సీఎం సమావేశం నుండి విసురుగా బయటకు వచ్చారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే దివిశివరాం ల ముందే పార్టీని, నేతలను తిడుతూ చిందులు తొక్కారు. పార్టీ అధిష్టానం పైనా దూషణలకు దిగారు. టికెట్ ఇవ్వకపోతే ఈ పార్టీ అక్కరలేదంటూ విరుచుకుపడ్డారు. అక్కడి నుంచే చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణకు ఫోన్ చేశారు. వెంటనే బాలకృష్ణ సీఎంకు ఫోన్‌చేశారు. మీతే మాట్లాడేందుకు అమరావతికి వస్తున్నానంటూ బాలకృష్ణ సీఎంకు వర్తమానం పంపారు. బాబూరావుకే టికెట్ ఇవ్వాలని బాలకృష్ణ ఒత్తిడి తెచ్చే పక్షంలో ఉగ్రనరసింహారెడ్డిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా నిలిపితే ఎలా ఉంటుందని సీఎం జిల్లా టీడీపీ నేతలతో అప్పటికప్పుడే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ పరిస్థితిలో బాలకృష్ణ ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుంది..? అందుకు సీఎం లొంగుతారా..? అదే జరిగితే కనిగిరి టికెట్ బాబూరావుకేనా..? ఉగ్ర ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీకి అంగీకరిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే. -
సీటు నాకే.. కాదు నాకే!
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: కనిగిరి టీడీపీ రాజకీయం రోడ్డెక్కింది. ఆ పార్టీలో సీటు పోట్లాట రచ్చకెక్కింది. రాబోయే ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ తనకేనంటూ మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి సంకేతాలు ఇస్తుండగా తనకు సీటు రాకపోయినా పరవాలేదు పార్టీలో సభ్యత్వం లేని ఉగ్రకు మాత్రం సీటు దక్కనివ్వనంటూ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తేల్చిచెబుతున్నారు. దీంతో కనిగిరి టీడీపీ నేతలు, కార్యకర్తలలో గందరగోళం నెలకొంది. కొంతకాలంగా కనిగిరి టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి ఇస్తారని టీడీపీలో ప్రచారం సాగుతోంది. టీడీపీ జిల్లా నేతలతోపాటు కొందరు రాష్ట్ర నేతలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కనిగిరిలో తిరుగులేని శక్తిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాదవ సామాజిక వర్గానికి చెందిన బుర్రా మధుసూదన్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దించింది. దీంతో రెడ్డి సామాజికవర్గాన్ని ఆకర్శించేందుకు ఆ సామాజికవర్గానికి టీడీపీ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తుగడగా ప్రచారం సాగింది. టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సైతం కనిగిరి నుంచి ఉగ్రనరసింహారెడ్డికి టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి సూచించినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది. మొత్తంగా కనిగిరి నుంచి ఉగ్రకే టీడీపీ టికెట్ అభిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. సిటింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఆది నుంచి ఉగ్ర అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. తనకు సన్నిహితుడైన నందమూరి బాలకృష్ణ ద్వారా తానే టికెట్ తెచ్చుకుంటానని ఆయన ఆది నుంచి అనుచరులకు భరోసా ఇస్తున్నారు. అయితే సామాజిక వర్గ సమీకరణల్లో భాగంగా కనిగిరి నుంచి ఉగ్రకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించిన సీఎం ఎమ్మెల్యే కదిరి బాబూరావును ఒప్పించేందుకు సిద్దమైనట్లు ప్రచారం సాగుతోంది. నేడో రేపో ఆ తంతూ ముగియనున్నట్లు సమాచారం. ఈ సమయంలో కనిగిరిలో ఉగ్రసేన కార్యకర్తలు, అభిమానులతో బుధవారం ఉగ్ర సమావేశం నిర్వహించారు. తనకు టీడీపీ నుంచి ఆహ్వానం ఉందని, ఆ పార్టీ నుంచి పోటీ చేసేఅవకాశముందని చెప్పకనే చెప్పారు. దీంతో ఉగ్రకు టికెట్ ఖాయమైందన్న ప్రచారం జిల్లా వ్యాప్తంగా సాగింది. దీంతో ఉలిక్కి పడిన ఎమ్మెల్యే కదిరి బాబూరావు మర్నాడే పార్టీ కార్యకర్తలతో కనిగిరిలో పోటీ సమావేశం పెట్టారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు తనకు తప్ప ఇక్కడ కొత్త వ్యక్తులకు అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రి ఒక వేళ తనను కాదంటే పార్టీకి చెందిన పాత వ్యక్తులకు ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం కల్పిస్తాను తప్ప పార్టీలో సభ్యత్వం లేని ఉగ్రను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘కొందరు నాకు టికెట్ వచ్చింది. నాకు అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు వాటిని నమ్మొద్దు’ అని చెప్పారు. నియోజకవర్గంలో తాను కోట్ల రూపాయల అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ రోజు కొత్త నాయకులు వస్తామంటే తను, తన కార్యకర్తలు ఒప్పుకోబోరనన్నారు. చంద్రబాబుకు ఏ కులం వారు కావాలన్నా తన దగ్గరున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. కనిగిరిలో మార్పులుండవన్నారు. మళ్లీ తానే ఎమ్మెల్యే అభ్యర్థినని కదిరి బాబూరావు తేల్చి చెప్పారు. అటు ఉగ్ర ఇటు కదిరి వ్యాఖ్యలతో కనిగిరి టీడీపీలో గందరగోళం నెలకొంది. చివరకు అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియని పరిస్థితి. టీడీపీ పోట్లాటలు వైఎస్సార్సీపీకి లాభిస్తాయని టీడీపీ వర్గాలే పేర్కొంటుండం గమనార్హం. మొత్తంగా కనిగిరి టీడీపీలో విభేదాలు రోడ్డున పడ్డాయి. -
నేను చెప్పిన అభ్యర్ధికి టిక్కెట్ ఇస్తేనే ..
ఒంగోలు / పొన్నలూరు: అధికార పార్టీ నేతల మధ్య ఆసక్తికర సంవా దానికి సంగమేశ్వరుని ఆలయం సాక్షిగా నిలిచింది. విమర్శలు, ప్రతి విమర్శలకు చెన్నినపాడు గ్రామం వేదికగా మారింది. కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పరస్పరం పరోక్ష ఆరోపణలు చేసుకున్నారు. ఛలోక్తులు విసురుకున్నారు. కొండపి మండలంలోని చెన్నిపాడు సంగమేశ్వరం ఆలయంలో స్థానికఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, టీడీపీ నాయకుడు దామచర్ల సత్యనారాయణల ఆధ్వర్యంలో శనివారం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలువురు టీడీపీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ తాను చెప్పిన అభ్యరి టిక్కెట్ ఇస్తేనే ఒంగోలు ఎంపీగా పోటా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పలేదన్నారు. అంతకు ముందు కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా టీడీపీలో ఉండి పార్టీ అధికారంలోకి రావడానికి తాము కృషి చేశామన్నారు. నామినేషన్లో జరిగిన తప్పిదం వలన 2009లో ఎమ్మెల్యే కాలేకపోయానని, మళ్లీ ప్రజల ఆశీస్సులతో 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. నాలుగేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని చెప్పుకొచ్చారు. అయితే కొత్తగా పార్టీలో చేరిన వారు, పార్టీలో చేరి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని చెప్పుకుంటున్న వారు కార్యకర్తల్లో ఆందోళన సృష్టిస్తున్నారని పరోక్షంగా ఎమ్మెల్సీ మాగుంటని, మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. వెంటనే దీనికి స్పందించిన మాగుంట తాను ఏ రోజూ పలాన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వమని, పలాన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వొద్దని చెప్పలేదన్నారు. పార్టీలో ఎప్పుడు చేరినా ఆ పార్టీ అభివృద్ధి కోసమే పని చేస్తున్నామని బిగ్గరగా చెప్పారు. సంగమేశ్వరం ఆలయ ఆవరణంలో ఉండి చెబుతున్నాను జిల్లాలో ఏ ఎమ్మెల్యేను కూడా మార్చమని తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పలేదని బాబురావుకు సమాధానంగా చెప్పారు. అనంతరం కరణం బలరాం మాట్లాడుతూ పార్టీలో సీనియర్ నాయకులం అయినప్పటికీ ఎమ్మెల్సీలుగా పిలిపించుకోవడం ఇబ్బందిగా ఉందన్నారు. వన భోజనాల పేరుతో ఇటువంటి కార్యక్రమం పెట్టి నాయకులు, కార్యకర్తల మధ్య సయోధ్య కుదర్చడం మంచిదని సూచించారు. ఈ సభతో స్వామి కార్యం, స్వకార్యం రెండు జరిగాయని పరోక్షంగా ఎమ్మెల్యే డోలాను ఉద్దేశించి ఛలోక్తి విసిరారు. కనిగిరి ఎమ్మెల్యే బాబురావు టిక్కెట్ వ్యవహరంలో కొంత అయోమయంలో ఉన్నాడని, ఇబ్బందులు ఉన్నా పార్టీ కోసం అన్ని పరిస్థితులను నెట్టుకొని ముందుకు పోవాలని సూచించారు. టీడీపీ నేతల మధ్య నెలకొన్ని ఈ ఆసక్తికర వ్యాఖ్యలు జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమయ్యాయి. -
ఎక్సైజ్ అధికారులపై ఎమ్మెల్యేల ధ్వజం
ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఎక్సైజ్ అధికారుల అక్రమాలపై పాలక, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఏకమై ధ్వజమెత్తారు. అధికారులు అక్రమాలకు పాల్పడుతూ మద్యం ధరలను ఎమ్మార్పీకి కాకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారని, బెల్టుషాపులు నడుస్తున్నా ముడుపులు పుచ్చుకొని వదిలేస్తున్నారని విమర్శించారు. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు కనిగిరి నియోజకవర్గంలో ఎక్సైజ్ సీఐ లేరని, అధిక ధరలు అమ్ముకునేందుకు తనకు రూ.2 కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నించారని..ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించానని సభ దృష్టికి తెచ్చారు. అధిక ధరల విషయమై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు, అసిస్టెంట్ కమిషనర్‌కు, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు చెప్పినా ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఎక్సైజ్ ఉన్నతాధికారులు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, నచ్చని వారి మద్యం షాపులపై దాడులు చేసి కేసులు నమోదు చేసి వేధిస్తున్నారన్నారు. ఒంగోలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.భాస్కరరావుకు అంతా తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్తు శాఖలోని షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాల నియామకాల్లో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిబంధనలను తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకుల చెప్పు చేతల్లో విద్యుత్తు శాఖాధికారులు, కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.జయకుమార్ జిల్లాలో అవలంబిస్తున్న కొత్త పథకాలు, విద్యుత్తు లేని ఎస్సీ, ఎస్టీ గ్రామాలకు విద్యుత్తు సరఫరా వివరాలను తెలియజేశారు. ఆదాయం రావటం లేదన్న కనిగిరికి చెందిన ఎక్సైజ్ అధికారిపై విచారణ చేపట్టి త్వరలో నివేదిక అందజేయాలని ఒంగోలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.భాస్కరరావును కలెక్టర్ విజయకుమార్ ఆదేశించారు. జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఎమ్మార్పీకే మద్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని, బెల్టు షాపులు నెల రోజుల్లో జిల్లావ్యాప్తంగా లేకుండా చేయాలని ఆదేశించారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తి చేసుకున్న నాలుగు సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లను ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ మద్యం షాపులు అడ్డగోలుగా నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. యర్రగొండపాలెంలో విద్యుత్తు సమస్య ఎక్కువగా ఉందని, నియోజకవర్గంలో 70 చెంచుగూడేలు విద్యుత్ లేక అంధకారంలో ఉన్నాయన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ మద్యం షాపులపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ పొదిలిలో మద్యం షాపు యజమానులందరూ సిండికేటై మద్యం ధరలను పెంచేందుకు దోహదపడ్డారన్నారు. విద్యుత్ సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకంలో అక్రమాలు జరిగాయని, ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షల చొప్పున అధికార పార్టీ నాయకులు తీసుకున్నారన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని నాలుగు సబ్స్టేషన్లు నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ ఇంత వరకు ఒకటి కూడా ప్రారంభించలేదన్నారు. బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పని చేస్తున్న కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం అధికంగా ఉందన్నారు. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ మద్యం విధానంలో ఎమ్మార్పీ ధరలకు విక్రయించాల్సిందేనని బెల్టు షాపులను నిర్మూలించాల్సిందేనని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో అధికారులు కూడా పారదర్శకంగానే వ్యవహరిస్తున్నారని, ఆర్ఓఆర్ను పాటిస్తున్నారని, అధికార పార్టీ నాయకుల జోక్యం ఎక్కడా లేదన్నారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ విద్యుత్ శాఖ షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో అవకతవకలు జరిగాయంటున్నారని, ఇప్పటి వరకు జరిగిన నియామకాలన్నింటినీ రద్దు చేసి నూతన నియామకాలకు అందరూ సహకరించాలని ప్రకటించడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పని చేస్తున్న వారినందరినీ తీసేస్తే మొత్తాన్ని టీడీపీ కార్యకర్తలతో నింపేయాలని చూస్తున్నారా అని ఎదురుతిరిగారు. -
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 'పవర్' కట్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పవర్ కట్ తప్పలేదు. శుక్రవారం సభా సమావేశాలు జరుగుతుండగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల కోసం పాత శాసనసభ భవనాన్ని తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. మరోవైపు అసెంబ్లీ భవనంలో వసతులపై పలువురు శాసనసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పురాతన భవనం కావటంతో ఏసీ సదుపాయంతో పాటు, ఫ్యాన్లు సరిగా లేకపోవటంతో పాటు మౌలిక సదుపాయాలు లోపించటంపై సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు శుక్రవారం మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు సరైన వసతులు కల్పించలేదని ఆరోపించారు. శాసనసభ్యుల సంఖ్యకు అనుగుణంగా హాలును కేటాయించలేదని విమర్శించారు. ఎమ్మెల్యేలకు సక్రమమైన వసతులు లేవని కదిరి బాబూరావు మనసులోని మాటను వెల్లడించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు మంచి అసెంబ్లీ నిర్వహిస్తామని తెలిపారు.