ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 'పవర్' కట్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పవర్ కట్ తప్పలేదు. శుక్రవారం సభా సమావేశాలు జరుగుతుండగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల కోసం పాత శాసనసభ భవనాన్ని తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. మరోవైపు అసెంబ్లీ భవనంలో వసతులపై పలువురు శాసనసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పురాతన భవనం కావటంతో ఏసీ సదుపాయంతో పాటు, ఫ్యాన్లు సరిగా లేకపోవటంతో పాటు మౌలిక సదుపాయాలు లోపించటంపై సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు శుక్రవారం మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు సరైన వసతులు కల్పించలేదని ఆరోపించారు. శాసనసభ్యుల సంఖ్యకు అనుగుణంగా హాలును కేటాయించలేదని విమర్శించారు. ఎమ్మెల్యేలకు సక్రమమైన వసతులు లేవని కదిరి బాబూరావు మనసులోని మాటను వెల్లడించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్కు మంచి అసెంబ్లీ నిర్వహిస్తామని తెలిపారు.