ఓం నమో రుద్రాయ | mahasivarathree special | Sakshi
Sakshi News home page

ఓం నమో రుద్రాయ

Published Wed, Feb 18 2015 1:57 AM | Last Updated on Mon, Oct 8 2018 7:04 PM

mahasivarathree special

మార్మోగిన శివనామస్మరణ
పరమేశ్వరుడికి అభిషేకాలు
జిల్లాలో ఆలయాలు కిటకిట

 
భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రిని జిల్లా ప్రజలు మంగళవారం జరుపుకున్నారు. హరహరమహాదేవ శంభోశంకర అంటూ శివనామస్మరణతో రావికమతం మండలం కళ్యాణపులోవ, హుకుంపేట మండలం మత్స్యగుండం, నర్సీపట్నంలోని ఉత్తరవాహిని, రాంబిల్లి మండలం పంచదార్ల, తదితర ప్రాంతాల్లోని ఆలయాలు మారుమోగాయి.

వేకువజామునుంచి భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. అభిషేకాలు చేయించుకున్నారు. రోజంతా ఉపవాసం పాటించారు. తెల్లవార్లూ జాగరణ చేశారు.  కళ్యాణపులోవ జలాశయంలో పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement