వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు | Mahatma Gandhi, Lal Bahadur Shastri birth anniversary celebration in YSRCP office | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

Published Thu, Oct 3 2013 2:58 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు - Sakshi

వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

జాతిపిత మహాత్మాగాంధీ, దివంగత ప్రధానమంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి చిత్రపటాలతోపాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి.. పుష్పాంజలి ఘటించారు.
 
సుదీర్ఘ కాలం తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడంతో అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసింది. గాంధీ, శాస్త్రి జయంతి వేడుకల్లో పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణ, డీఏ సోమయాజులు, బాజిరెడ్డి గోవర్ధన్, వైవీ సుబ్బారెడ్డి, నల్లా సూర్యప్రకాష్, బి.జనక్‌ప్రసాద్, కె.శివకుమార్, వాసిరెడ్డి పద్మ, పీఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement