మహాత్ముడికి వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్ : జాతిపిత మహాత్మగాంధీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీ 67వ వర్థంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం వైఎస్ జగన్ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మగాంధీ అహింస సిద్ధాంతం అందరికీ ఆదర్శం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.