హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పాలక మండలి సర్వసభ్య సమావేశం శుక్రవారమిక్కడ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశం మేయర్గా మాజిద్ హు్స్సేన్కు చివరిది కాగా...కమిషనర్ సోమేష్ కుమార్కు మొదటిది. కాగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం గతంలో ఆరు నెలలకో... తొమ్మిది నెలలకో మాత్రమే జరిగేది.
ఇటీవల చట్ట సవరణ కారణంగా మూడు నెలల్లోగా తప్పనిసరిగా సమావేశం కావాల్సి ఉంది. దీంతో సెప్టెంబర్ 23 తర్వాత ఈరోజు తిరిగి సమావేశమైంది. మొత్తం 14 అంశాలను ఎజెండాలో చేర్చారు. వీటన్నింటిపై అర్థవంతమైన చర్చ జరుగుతుందో...లేక ఎప్పటిలాగే రెండు, మూడు అంశాలపై మమ అనిపించనున్నారో ఈ సమావేశంలో తేలనుంది.