GHMC council meeting
-
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆందోళన
-
నన్ను పెంచి పోషిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు
-
బల్దియా చరిత్రలోనే మొదటిసారి.. ప్రతిపక్షాల విమర్శలు
జీహెచ్ఎంసీ కొత్త పాలకమండలి ఏర్పాటైన ఐదు నెలల తర్వాత..మొట్టమొదటి సమావేశం మంగళవారం వర్చువల్‌గా నిర్వహించారు. కోవిడ్ నిబంధనల కారణంగానే బల్దియా చరిత్రలోనే మొదటిసారిగా వర్చువల్ సమావేశం నిర్వహించగా.. సభ్యులంతా ఆయా ప్రాంతాల నుంచి పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో చెత్త, నాలాల సమస్యలపై సభ్యులు మండిపడ్డారు. కరోనాతోపాటు వర్షాకాల వ్యాధుల భయంతో ప్రజలు వణికిపోతుంటే అధికారులు పారిశుధ్య నిర్వహణలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రతిపక్షాలకు సమాధానాలు చెప్పలేకే వర్చువల్‌గా నిర్వహించారన్నారు. ఎన్నో కార్యక్రమాలు గుంపులతో జరుగుతున్న తరుణంలో వర్చువల్‌గా నిర్వహించడాన్ని తప్పుబట్టారు. గత పాలకమండలి స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన రూ. 5600 కోట్లకు తోడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వచ్చే నిధులను కూడా కలిపి మొత్తం రూ.6841.87 కోట్ల బడ్జెట్‌కు సభ ఆమోదం తెలిపింది. –సాక్షి, సిటీబ్యూరో ♦ రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఫుట్‌పాత్‌లు, పచ్చదనం పెంపు, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్, నాలా పనులకు కూడా ఎక్కువ నిధులు కేటాయించారు. ♦పట్టణ ప్రగతి కింద ప్రభుత్వం నుంచి రూ.936 కోట్లు రాగలవనే అంచనాతో వాటిని బడ్జెట్లో పొందుపరిచారు. బాండ్ల ద్వారా పొందిన రుణాల చెల్లింపులు, వడ్డీలకు రూ.228.78 కోట్లు ఖర్చుకానున్నట్లు పేర్కొన్నారు. ♦ 2020 డిసెంబర్ ఒకటో తేదీన ఎన్నికలు ముందస్తుగా జరిగినా..గత పాలకమండలి గడువు ముగియనందున 2021 ఫిబ్రవరి 11 వరకు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జరగలేదు. ఆ తర్వాత కరోనాతో సహ వివిధ కారణాలతో సర్వసభ్య సమావేశంజరగలేదు. ♦ మేయర్‌తోపాటు కమిషనర్ లోకేశ్‌కుమార్, ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీ కాన్ఫరెన్స్ హాల్‌నుంచి పాల్గొన్నారు. గత నవంబర్‌లో స్టాండింగ్ కమిటీ ఆమోదించినప్పుడు ‘బి’ బడ్జెట్ లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వచ్చే నిధులను ‘బి’గా పేర్కొంటూ ఇప్పుడు చేర్చారు. సభాధ్యక్ష స్థానం నుంచి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ చేపట్టిన, చేయనున్న కార్యక్రమాల గురించి ప్రసంగించారు. చెత్తమయంగా నగరం: ఎంఐఎం ఎంఐఎంకు చెందిన జాఫ్రీ, మాజిద్ హుస్సేన్, సున్నం రాజ్‌మోహన్, సలీంబేగ్ తదితరులు మాట్లాడుతూ కాగితాల్లో భారీ కేటాయింపులు వాస్తవంగా ఖర్చు చేయడం లేరన్నారు. డంపర్బిన్లు తొలగించేందుకు సిటీ కమిషనర్ జాగీరా అని ప్రశి్నంచారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లులేక, డంపర్బిన్లు తొలగించడంతో నగరం చెత్తదిబ్బగా మారిందన్నారు. ఇళ్లనుంచి చెత్త తరలించాల్సిన స్వచ్ఛ ఆటోలతో మెయిన్రోడ్లపై చెత్త తొలగిస్తున్నారని, అలాంటప్పుడు వాటికి ప్రజాధనం ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.వీరంతా దారుస్సలాం నుంచి పాల్గొన్నారు. కుంభకోణాలకు ఆస్కారం: బీజేపీ ఇది తూతూమంత్రపు బడ్జెట్ అని బీజేపీ సభ్యుడు దేవర కరుణాకర్ అన్నారు. పేదల కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని భూసేకరణ, గ్రీనరీల పేరిట వందల కోట్ల రూపాయలు కేటాయించడం కుంభకోణాలకు ఆస్కారమిస్తుందన్నారు. ప్రతిపక్షాలు ప్రశి్నస్తుంటే వినిపించకుండా మ్యూట్‌లో పెట్టారని, బడ్జెట్లో లెక్కలకు, సమావేశంలో కమిషనర్ లెక్కలకు తేడా ఉందన్నారు. ఈ బడ్జెట్‌ను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నాలా సమస్యలు పట్టించుకోవడం లేరని బీజేపీకే చెందిన శంకర్‌యాదవ్ తదితరులు విమర్శించారు. బడ్జెట్‌పై మాట్లాడేందుకు కాంగ్రెస్‌కు అవకాశంఇవ్వనందుకు ఆపార్టీకి చెందిన రజిత నిరసన వ్యక్తం చేశారు. కరోనాతోపనుల్లో జాప్యం:కమిషనర్ లోకేశ్‌కుమార్ కరోనా కారణంగా అన్ని పనులు పూర్తిస్థాయిలో చేయలేకపోయామని సభ్యలడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. కరోనా బారిన పడి జీహెచ్ఎంసీ ఉద్యోగులు 31 మంది మృతి చెందారన్నారు. వారి కుటుంబాలకందాల్సిన ప్రయోజనాలు అందించామన్నారు. కొత్త సభ్యుడి ప్రమాణస్వీకారం.. లింగోజిగూడ ఉప ఎన్నికలో గెలిచిన రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మేయర్ విజయలక్షి్మని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం ప్రారంభానికి ముందుగా మేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు.రాజశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘పట్టణ ప్రగతి’లో పాల్గొనండి జూలై ఒకటో తేదీ నుంచి పది రోజుల పాటు పెద్దయెత్తున నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటర్లతో పాటు ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలి. ఇందులో వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష ఉంటుంది. సీజనల్ వ్యాధుల నివారణకు భారీయెత్తున పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, నీటినిల్వల తొలగింపు, నగరంలో చెత్త తొలగింపు, రోడ్ల వెంబడి పిచి్చమొక్కల తొలగింపు, దోమల నివారణ మందుల స్ప్రేయింగ్, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, శిథిలభవనాల కూల్చివేతలు, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లకు స్థలాల సేకరణ వంటి కార్యక్రమాలు పట్టణ ప్రగతిలో నిర్వహిస్తాం. – గద్వాల్ విజయలక్షి మేయర్ -
ఆర్టీసీకి నిధులపై నిలదీసిన రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : శనివారం నగరంలో జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ వాడివేడిగా జరిగింది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, ఎమ్మెస్ ప్రభాకర్, కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో ఎక్కడ చూసినా చెత్త, చెదారంతో నిండిఉండడంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలకు తీవ్ర జ్వరాలు వస్తున్నాయని కార్పొరేటర్లు ఆరోపించారు. డల్లాస్ లేదు, ఇస్తాంబుల్ లేదు. ఆటో నగర్ డంపింగ్ యార్డుతో జనాలు రోగాల బారిన పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ నిలదీశారు. ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆర్థిక అంశాలలో జీహెచ్ఎంసీ పాత్ర పరోక్షంగా ఉందని విమర్శించారు. ఆర్టీసీకి సంవత్సరం వారీగా ఎంత మొత్తంలో నిధులు విడుదల చేశారు? ఇంకా ఎన్ని ఇవ్వాలి? జీహెచ్ఎంసీ ఆర్టీసీకి నిధులు ఇవ్వాలని నిబంధన ఉందా? లేక దయాదాక్షిణ్యాల మీద ఇవ్వాలా? అనే విషయాలపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు కూకట్పల్లి ప్రాంతంలో మురికివాడలు పల్లెటూర్ల కంటే దారుణంగా ఉన్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. -
24న స్టాండింగ్ కమిటీ సభ్యుడి ఎన్నిక
సత్యనారాయణ మృతితో ఏర్పడిన ఖాళీ షెడ్యూల్ విడుదల చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ 15వరకు నామినేషన్ల స్వీకరణ 20న ఉపసంహరణ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు జె.సత్యనారాయణ (రాజేంద్రనగర్ కార్పొరేటర్) ఆకస్మిక మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఎన్నిక షెడ్యూల్ జారీ అయింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ శనివారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 24న ఎన్నిక నిర్వహిస్తారు. శనివారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 15వరకు (పనిదినాల్లో) నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు దాఖలు చేసినవారి జాబితాను 16న వెలువరిస్తారు. 17న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఆ తరువాత పోటీకి అర్హులైన వారి పేర్లను వెలువరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాను అదే రోజు ప్రకటిస్తారు. 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయంలో పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఆసక్తికరం కానున్న ఎన్నిక.. జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉండగా, పదిమంది కార్పొరేటర్లకు ఓ సభ్యుడి వంతున మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్-ఎంఐఎం పరస్పర పొత్తుతో గత జూన్‌లో జరిగిన ఎన్నికల్లో నెగ్గిన వారిలో ఒకరైన రాజేంద్రనగర్ కార్పొరేటర్ సత్యనారాయణ(కాంగ్రెస్) ఇటీవల మరణించారు. ఖాళీ ఏర్పడిన ఈ స్థానానికి తాజాగా ఎన్నిక నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్ల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆ డివిజన్లు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు స్థానాల ఖాళీతో 147 మంది కార్పొరేటర్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు, ఓటు వేసేందుకు అర్హులవుతారు. కాగా, ఇటీవలి కాలంలో పలువురు కార్పొరేటర్లు పార్టీలు మారారు. మరోవైపు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఖాళీ అయిన స్థానం కాంగ్రెస్ కోటాలోది. టీడీపీ-బీజేపీ పొత్తు.. టీడీపీ నుంచి పలువురు టీఆర్ఎస్లో చేరడం, కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ దిడ్డిరాంబాబు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో కంటే బీజేపీ కార్పొరేటర్ల బలం పెరగడం.. కాంగ్రెస్ నుంచి కొందరు ఇతర పార్టీలకు వెళ్లగా మరికొందరు కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలి కాలంలో ఎంఐఎం టీఆర్ఎస్తో దోస్తీ కట్టడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నిక సైతం ఆసక్తికరంగా మారింది. -
అడుగడుగునా నిఘా
జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అమలులో భాగంగా చర్యలు ఆగస్టు 15 నుంచి ఆచరణ బయోమెట్రిక్ హాజరు జీహెచ్ఎంసీ ఉద్యోగులకూ గ్రీవెన్స్ డే నగదు రహిత వైద్య సదుపాయం సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాలు, చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్లు, పార్కింగ్, డంపింగ్ యార్డుల వద్ద వెబ్ అనుసంధాన సీసీ కెమెరాలు ఏర్పాటు కాబోతున్నాయి. మొత్తం 32 ప్రాంతాల్లో వీటిని ఏరాటు చేయనున్నారు. ఈ కెమెరాల్లోని దృశ్యాలు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పాటు పోలీసు శాఖకూ అందుబాటులో ఉంటాయి. కెమెరాల ఐపీ అడ్రస్‌ల ఆధారంగా పోలీసు కంట్రోల్ రూమ్ వీటిని పరిశీలిస్తుంది. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మొబైల్ ఫోన్లలో సైతం వీటిలోని దృశ్యాలు వీక్షించవచ్చు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అమలులో భాగంగా నగరంలో జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం రోజూ వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో కార్యాలయాల వద్ద వీటి ఏర్పాటుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు నేరస్థులను గుర్తించేందుకే కాకుండా, పని వేళల్లో పదేపదే బయటకు వెళ్లే ఉద్యోగులపై నిఘాకు కూడా ఇవి ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఆగస్ట్ 15 నుంచి దీనిపై కార్యాచరణకు దిగనున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ విలేకరులకు చెప్పారు. వీటిలో నిక్షిప్తమయ్యే దృశ్యాలు కనీసం నెల రోజుల పాటు అందుబాటులో ఉంటాయన్నారు. వ్యాపార ప్రాంతాలు.. అపార్ట్మెంట్లలోనూ.. జీహెచ్ఎంసీ కార్యాలయాలతో పాటు వ్యాపార సంస్థలు, అపార్ట్మెంట్లలో సైతం ఈ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. వ్యాపారులు ట్రేడ్ లెసైన్సులు పొందేటప్పుడే తమ షాపులోని దృశ్యాలను చిత్రీకరించేలా ఏర్పాటు చేసుకునే కెమెరాలతో పాటు, బయటి దృశ్యాలు చిత్రీకరించేలా మరో కెమెరాను అదనంగా ఏర్పాటు చేయాల్సిందిగా సూచించనున్నారు. మున్ముందు ఈ అంశాన్ని తప్పనిసరి చేసే యోచనలో ఉన్నారు. అపార్ట్మెంట్ పరిసరాలను చిత్రీకరించేలా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చేముందు సంబంధిత వ్యక్తులకు సూచించనున్నారు. గుర్తింపు కార్డులు.. బయోమెట్రిక్ హాజరు జీహెచ్ఎంసీ ఉద్యోగులందరికీ గుర్తింపు కార్డులతో పాటు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయనున్నారు. వాహనాలన్నిటికీ జీపీఎస్ సిస్టమ్ అమలు చేయనున్నారు. యూనియన్ల విజ్ఞప్తి మేరకు డ్రైవర్లు, ఇతరత్రా సిబ్బంది, మహిళా ఉద్యోగులకు అవసరమైన లంచ్‌రూమ్‌లు, చేంజ్రూమ్లు, టాయ్‌లెట్ సదుపాయాలు కల్పిస్తామని కమిషనర్ చెప్పారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వంగా మెలగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనను పాటిస్తామని తెలిపారు. ప్రతి సోమవారం మధ్యాహ్నం 1-1.30 గంటల మధ్య అన్ని సర్కిల్, జోనల్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల ఫిర్యాదు దినంగా పాటిస్తామన్నారు. ఉద్యోగులు తమ సమస్యలను రాతపూర్వకంగా అందజేస్తే మరుసటి వారానికి పరిష్కరిస్తామన్నారు. పరిష్కరించలేకపోతే అందుకు కారణాలు తెలుపుతూ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులు తమ వేతనాలు, సెలవులు, ఇంక్రిమెంట్లు తదితర సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వివరించారు. వైద్య సదుపాయం జేబులో డబ్బు లేకున్నా జీహెచ్ఎంసీ ఉద్యోగులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందేలా ఏర్పాట్లు చేస్తామని కమిషనర్ తెలిపారు. దీని కోసంఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకుంటామని, జీహెచ్ఎంసీ ఉద్యోగుల గుర్తింపు కార్డు చూపితే నగదు లేకున్నా వైద్య సేవలందించేలా ఈ విధానం అమలవుతుందన్నారు. తెల్లకార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కార్డులాగా జీహెచ్ఎంసీ ఉద్యోగులకు వారి గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందన్నారు. దీర్ఘకాలంగా ఉన్న వారికి స్థాన చలనం జీహెచ్ఎంసీలో ఒకే చోట మూడేళ్లకు పైబడి పని చేస్తున్న వారిని బదిలీ చేయనున్నట్లు కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. కారుణ్య నియామకాలను చేపడతామన్నారు. వీటికి సంబంధించిన వారు తమను సంప్రదిస్తే వీలైనంత త్వరితంగా నియామకాలు పూర్తి చేస్తామని వివరించారు. -
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రారంభం
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పాలక మండలి సర్వసభ్య సమావేశం శుక్రవారమిక్కడ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశం మేయర్‌గా మాజిద్ హు్స్సేన్కు చివరిది కాగా...కమిషనర్ సోమేష్ కుమార్‌కు మొదటిది. కాగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం గతంలో ఆరు నెలలకో... తొమ్మిది నెలలకో మాత్రమే జరిగేది. ఇటీవల చట్ట సవరణ కారణంగా మూడు నెలల్లోగా తప్పనిసరిగా సమావేశం కావాల్సి ఉంది. దీంతో సెప్టెంబర్ 23 తర్వాత ఈరోజు తిరిగి సమావేశమైంది. మొత్తం 14 అంశాలను ఎజెండాలో చేర్చారు. వీటన్నింటిపై అర్థవంతమైన చర్చ జరుగుతుందో...లేక ఎప్పటిలాగే రెండు, మూడు అంశాలపై మమ అనిపించనున్నారో ఈ సమావేశంలో తేలనుంది.