'సీఎం కిరణ్ బ్యాట్స్మెన్ కాదు... వికెట్ కీపర్'
సీఎం కిరణ్కుమార్పై యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు గురువారం నిప్పులు చెరిగారు.సీఎం కిరణ్ బ్యాట్స్మెన్ కాదు... వికెట్ కీపర్ అని ఆరోపించారు. సీఎం కిరణ్ హయాంలో మత్స్యకారులకు ఆయన చేసింది శూన్యమని పేర్కొన్నారు. కిరణ్ మత్స్యకారుల ద్రోహి అంటూ అభివర్ణించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపల వేట నిషేధించిన సమయంలో మత్స్యకారులకు ఆదుకున్న సంగతిని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
మత్స్యకారులకు వైఎస్ ప్రభుత్వం 30 కిలోల బియ్యం అందించిన సంగతిని ఆయన ఉదాహరించారు. ఇప్పటికైన మత్స్యకారులను ఆదుకోవాలని ఆయన సీఎం కిరణ్కు హితవు పలికారు. తమను ఆదుకోవాలని సీఎం కిరణ్ పాల్గొనే రచ్చబండ కార్యక్రమాల్లో నిలదీయాలని మల్లాడి కృష్ణారావు మత్స్యకారులకు సూచించారు.