పత్తిచేనులో వ్యక్తి దారుణహత్య | Man brutally killed | Sakshi
Sakshi News home page

పత్తిచేనులో వ్యక్తి దారుణహత్య

Published Thu, Jan 14 2016 6:29 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man brutally killed

కోడుమూరు (కర్నూలు) : పత్తిచేనులో పని చేసుకుంటున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ చినరామన్న(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో గురువారం పత్తి చేనులో పని చేసుకుంటుండగా.. కొందరు దుండగులు రాళ్లతో, కత్తులతో వెంబడించి దారుణంగా హతమార్చారు. గ్రామానికి చెందిన ఓ మహిళతో చినరామన్నకు వివాహేతర సంబంధం ఉందని.. ఆ మహిళకు చెందినవారే హతమార్చి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement