విద్యుదాఘాతంతో డ్రైవర్ మృతి | man died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో డ్రైవర్ మృతి

Published Wed, Aug 19 2015 10:39 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

man died due to current shock

వేంపల్లె: వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె మండలంలో విద్యుదాఘాతంలో ఒకరు మృతిచెందారు. స్థానిక వీరన్నగట్టుపల్లెకు చెందిన పందెల నాగేంద్ర(27) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం పొలం పనులకు వెళ్లి బావి వద్ద మోటారు ఆన్ చేసేందుకు ప్రయత్నించగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఐదు నెలల కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement