సెల్‌టవరెక్కి వ్యక్తి హల్‌చల్
Published Wed, Mar 16 2016 9:21 AM | Last Updated on Wed, Sep 26 2018 6:32 PM
నిమ్మనపల్లి : చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం అగ్రహరం గ్రామంలో బుధవారం నర్సింహులు(30) అనే వ్యక్తి సెల్‌టవరెక్కి హల్‌చల్ చేస్తున్నాడు. గ్రామస్తులు సదరు వ్యక్తిని కిందకు దించడానికి ప్రయత్నిస్తుంటే దూకేస్తానని బెదిరిస్తున్నాడు. తాను ప్రేమించే యువతి వచ్చేంతవరకు కిందకు దిగనని మొండికేశాడు. మతిస్థిమితం లేని వ్యక్తి అని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఊరికి వచ్చినట్లు చెబుతున్నారు. గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు.
Advertisement
Advertisement