నియోజకవర్గంలో ‘మంజీర మంచినీటి పథకం’ పనులు త్వరలో పరుగులు పెట్టనున్నాయి. ఈ పథకం కోసం గత ఏడాది నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) కింద రూ.40 కోట్లు మంజూరు కాగా టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగింది.
గజ్వేల్, న్యూస్‌లైన్: నియోజకవర్గంలో ‘మంజీర మంచినీటి పథకం’ పనులు త్వరలో పరుగులు పెట్టనున్నాయి. ఈ పథకం కోసం గత ఏడాది నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) కింద రూ.40 కోట్లు మంజూరు కాగా టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగింది. ఇందులో రెండు నెలల క్రితం రూ.10 కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. మిగతా రూ.30 కోట్ల నిధుల వినియోగానికి సంబంధించి ఇటీవలే ప్రభుత్వ ఆమోదం తెలిపింది. మరో పది రోజుల్లో ఇందుకు సంబంధించిన టెండర్లను పిలిచే అవకాశముంది. టెండర్లు పూర్తికాగానే పనులు ప్రారంభం కానున్నాయి. గజ్వేల్‌తోపాటు నర్సాపూర్, దుబ్బాక, మెదక్(పాత రామాయంపేట) నియోజకవర్గాల్లోని 20 వుండలాల పరిధిలోని 960 గ్రావూలకు నీరందించే లక్ష్యంతో 2007లో మంజీర మంచి నీటి పథకం పనులు ప్రారంభవుయ్యూరుు. సాలీనా వుంజీర నది నుంచి 0.7 టీఎంసీల నీటిని ఈ పథకం కోసం వాడుకోవాలని నిర్ణయించారు. తర్వాత దీన్ని 0.77 టీఎంసీలకు పెంచారు. ఈ క్రమంలోనే గజ్వేల్‌లో ఈ పథకానికి సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
ఎట్టకేలకు రూ.30 కోట్లకు అనుమతి..
గజ్వేల్ నియోజకవర్గంలో ‘మంజీర’ పథకం పనులు పూర్తిచేయడానికి ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ కింద గత ఏడాది రూ.40 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో నియోజకవర్గంలోని తూప్రాన్, వర్గల్, ములుగు, గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లోని 129 గ్రామాల్లో పైప్‌లైన్ విస్తరణ పనులతోపాటు పలుచోట్ల ఓహెచ్‌బీఆర్ ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది. కానీ కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం స్టేట్ టెక్నికల్ కమిటీ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉండగా ఈ ప్రక్రియలో నెలల తరబడి జాప్యం నెలకొంది. ఫలితంగా ప్రభుత్వం మంజూరు చేసిన రూ.40 కోట్లల్లో కేవలం రూ.10 కోట్లకు సంబంధించి మాత్రమే ఈ ప్రక్రియ రెండు నెలల క్రితం పూర్తయి టెండర్‌తోపాటు అగ్రిమెంట్ దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పనులను ప్రారంభించడమే మిగిలింది. తాజాగా ప్రభుత్వం ఇటీవలే రూ.30 కోట్ల వినియోగానికి కూడా ఆమోదం పలికింది. ఈ విషయాన్ని గజ్వేల్ ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ కమలాకర్ ధ్రువీకరించారు. పది రోజుల్లో టెండర్ కూడా పూర్తయ్యే అవకాశమున్నదని తెలిపారు.