ముంచంగిపుట్టు మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తున్న స్పెషల్ పార్టీ పోలీసులు
విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాధాన్ పేరుతో పీడీత ప్రజలను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తూ మావోయిస్టులు ఈనెల 25వతేదీ నుంచి నిరసన వారోత్సవాలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఏవోబీలో భయానిక వాతావరణం నెలకొంది.
కొయ్యూరు(పాడేరు), అరకులోయ: సాధారణంగా మావోయిస్టులు ఏడాదిలో రెండుసార్లు మాత్రమే వారోత్సవాలను నిర్వహిస్తారు. మొదటిది జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమర వీరుల వారోత్సవాలను నిర్వహిస్తారు. డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు ప్రజాగెరిల్లా విముక్తి దళం(పీఎల్‌జీఏ) వారోత్సవాలను నిర్వహిస్తారు. మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్రం చేపట్టినఆపరేషన్ సమాధాన్‌కు వ్యతిరేకంగా ఈ సారి నిరనస వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నెల 31 భారత్‌బంద్ చేయాలని పిలుపునిచ్చిందిమిలటరీ వ్యూహ రచనలో దిట్టయిన నాంబళ్ల కేశవరావు అలియాస్ గంగన సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బా«ధ్యతలు స్వీకరించిన తరువాత నిర్వహిస్తున్న రెండో వారోత్సవాలివి. ఈ నిరసన వారోత్సవాల్లో మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడే వీలుందని పోలీసులు భావిస్తున్నారు.
ఏవోబీఎస్‌జెడ్‌సీ అధికార ప్రతినిధి జగబ ంధు పేరిట కొద్ది రోజుల కిందట నిరసన వారోత్సవంపై ప్రకటన వెలువడింది. కేంద్రంలో ఉన్న బీజేపీ,రాష్ట్రంలో టీడీపీలు మావోయిస్టు ఉద్యమాన్ని అణిచివేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాయని ఆరోపించారు.సెల్‌టవర్లు పేల్చేస్తారని లేదా ఇతర సౌకర్యాలను నాశనంచేస్తారని ఆరోపిస్తూ పోలీసులు గిరిజనులతో ర్యాలీలు చేయిస్తున్నారని ఆరోపించారు. సంతలు ,బ్యాంకులకు వెళ్తున్న గిరిజనులను బలవంతంగా తీసుకుపోయి లొంగుబాట్లు చూపిస్తున్నారని విమర్శించారు.
నిరసన వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు విధ్వంసాలకు పాల్ప డే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల మావోయిస్టులు పలకజీడి వారపు సంతలో కరపత్రాలను ఎక్కువగా వేస్తున్నారు. ఈ రెండు నెలల్లో మూడుసార్లు కరపత్రాలను వేశారు.ఒకసారి సంతలో వ్యాపారులపై వేస్తే ఇటీవల పోలీసులకు వ్యతి రేకంగా పోస్టర్లు వేశారు.దీంతో పోలీసులు అటువైపు కూంబింగ్ ఉధృతం చేశారు.
నేతలకు హెచ్చరికలు
నిరసన వారోత్సవాలు ముగిసేంత వరకు బీజేపీ,టీడీపీ నేతలు,ఇతర ప్రజాప్రతినిధులు మారుమూల గ్రామాల్లో పర్యటనలు మానుకోవాలని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.ముంచంగిపుట్టు,పెదబయలు,హుకుంపేట,జైపూర్ జంక్షన్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.
పోలీసులు అప్రమత్తం
ఏవోబీ వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్నతాధికారులు రెడ్ ఆలర్ట్‌ను అమలుచేస్తున్నారు.ఏపీ,ఒడిశా సీఎంలు చంద్రబాబు,నవీన్‌పట్నాయిక్‌లు కూడా సరిహద్దులోని గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని జగబంధు ఆరోపించడంతో ఈ రెండు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. మల్క న్‌గిరి,కోరాపుట్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాలతో పాటు,అవుట్ పోస్టులు ఉన్న కటాఫ్ ఏరియాలో పోలీసు పార్టీలు కూంబింగ్ చర్యలను విస్తృతం చేశాయి. విశాఖ ఏజెన్సీ మారుమూల ప్రాంతాలపై నిఘా పెంచారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు పార్టీలు వాహనాల తనిఖీలు మమ్మురం చేశాయి.
మద్దిగరువులో మావోయిస్టు వాల్‌పోస్టర్లు
జి.మాడుగుల(పాడేరు): మండలంలో బొయితిలి పంచాయతీ మద్దిగరువు, సూరిమెట్ట పులుసుమామిడి గ్రామాల్లో బుధవారం రాత్రి మావోయిస్టుల వాల్‌పోస్టర్లు వెలిశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... హిందూ ఎజెండాతో మైనార్టీలు, మహిళలు, పీడిత సామాజిక వర్గాలపై చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని వాటిలో పేర్కాన్నారు. ఉద్యమ ప్రాంతాల్లో ప్రజలపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టులకు, బూటకపు లొంగుబాట్లకు అధికార పార్టీ నాయకులు బాధ్యతవహించాలని హెచ్చరించారు. సమాధాన్ పేరుతో ప్రజలపై కొనసాగుతున్న యుద్ధానికి వ్యతిరేకిస్తూ జనవరి 25 నుంచి 30 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీల ద్వారా నిరసనలు తెలిపాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. జనవరి 31న భారత్‌బంద్‌లో భాగంగా ఏవోబీలో బంద్ విజయవంతం చేయాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment