బుంగాపుట్టు –రంగిలిగుడ మధ్యలో మావోయిస్టులు నరికిన చెట్లు
ముంచంగిపుట్టు(పెదబయలు): బూటకపు ఎన్నికలు బహిష్కరించాలని కోరుతూ గురువారం బుంగాపుట్టు, రంగిలిగుడ గ్రామాల మధ్యలో రోడ్డుకు అడ్డంగా మావోయిస్టులు చెట్లు నరికారు. దీంతో బుంగాపుట్టు పంచాయతీ బుంగాపుట్టు, కోసంపుట్టు కేంద్రాలలో పోలింగ్ జరగలేదు. బుంగాపుట్టు పంచాయతీకి చెందిన బుంగాపుట్టు, కోసంపుట్టు పోలింగ్ బూత్‌లను ఏడు కిలో మీటర్ల దూరంలో ఉన్న మచ్చేపురానికి తరలించిన విషయం విధితమే. ఆ రెండు గ్రామాలకు చెందిన 1060 మంది ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తరలించడానికి అధికారులు 16 వాహనాలు ఏర్పాటు చేశారు. ఆ వాహనాలు గ్రామాల నుంచి ఓటర్లు పోలింగ్‌బూత్‌లకు తరలిస్తుండగా మావోయిస్టులు చెట్లు నరికారు. బూట కపు ఎన్నికలు బహిష్కరించాలని కోరుతూ బ్యా నర్లు కట్టారు. దీంతో ఆయా గ్రామస్తులు ఆందోళనకు గురై పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా తిరిగి తమ గ్రామాలకు చేరుకున్నారు. దీంతో ఆ రెండు బూత్‌లలో పోలింగ్ జరగలేదు. స్థానికులతో చెట్లను తొలగించారు. మూ డు గంటల తరువాత జీపులు పెదబయలు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment