రాజకీయాల్లో విజయం సాధించాలనే సంకల్పం సహజం. దాని కోసం ప్రజలకు చేరుక కావడానికి అభ్యర్థులు తమ లక్ష్యాలను వివరిస్తారు. మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి అవినీతి పరులు మాత్రం పూర్తిగా అర్ధం మార్చేశారు. ఐదేళ్లకోసారి నియోజకవర్గాలను మార్చుతూ.. దొడ్డి దారిన సంపాదించిన సొమ్ముతో ఓటర్లను, నాయకులనుకొనుగోలు చేసే నీచుడు.. ఇలాంటి రాజకీయ నాయకుడు ఉండరు అని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ విశాఖపార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు కంతేటి సత్యనారాయణరాజు అన్నారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన పరిశీలనకు వచ్చిన అంశాలను వివరించారు.
సాక్షి: విశాఖ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన మీరు ఏడు నియోజకవర్గాల ప్రజలను కలిశారు ..ఓటర్ల నాడి ఎటువైపు ఉంది?
కంతేటి : నేను విశాఖ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడిగా వచ్చి నెలరోజులైంది. అన్ని వర్గాల ప్రజలను కలిసి మాట్లాడాను. విశాఖలో ప్రభుత్వ భూములను కబ్జాలు చేశారని, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని భూకుంభకోణాలతో భ్రష్టు పట్టించిందని చెప్పారు. దాదాపు 70 శాతం విశాఖ ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాజన్న తనయుడికి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామనే ఆలోచన విశాఖ ప్రజల్లో బలంగా ఉంది.
సాక్షి:‘నవరత్నాల’కు ప్రజాధరణ ఎలా ఉంది ? అవి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారా?
కంతేటి :వందశాతం ప్రజల్లోకి తీసుకెళ్లాం. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించాయి. ప్రధానంగా మా పార్టీలో బూత్ కమిటీలు ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాం. నవరత్నాలతో ప్రజలలో విశేషస్పందన వచ్చింది. ఇది మా తొలివిజయంగా భావిస్తున్నాం.
సాక్షి:విశాఖలో డబ్బు ప్రభావం ఎక్కువ ఉండనుందా..? నియోజక వర్గాలు మారే గంటాను ఓడించనున్నారా?
కంతేటి :గంటాను విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అవినీతి డబ్బుతో మంత్రి గంటా అడ్డగోలుగా ఓటర్ల ప్రభావితం చేయాలని డబ్బు జల్లుతున్నాడు. రాజకీయమంటే కేవలం డబ్బు కాదని, విశాఖ ప్రజలు డబ్బుకు దాసోహం అవ్వరని ఈ ఎలక్షన్‌లో చూపిస్తారు. ఒక్కో ఎలక్షన్‌కు ఒక్కో నియోజకవర్గం మారే అవినీతి మంత్రి గంటాను విజ్ఞలైన విశాఖ ఉత్తర ప్రజలు ఓడించడం తధ్యం.
సాక్షి: ఈ ఎన్నికల్లో యువత, నిరుద్యోగులు ఏ పార్టీవైపు ఉంటారు?
కంతేటి : ఈ ఎన్నికల్లో యువత, నిరుద్యోగులు వైఎసార్‌సీపీకే ఓట్లు వేయనున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాల్లో 10 ఉద్యోగాలు, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రెండు లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు రోస్టర్ విధానం అమలు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించనున్నారు.
సాక్షి:మీకు వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధం గురించి చెప్పండి.?
కంతేటి : మేము స్నేహితులంగా ఉండేవాళ్లం. 1980–82 ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, నేను కేబినేట్ మంత్రులుగా చేశాం. అప్పటి నుంచే రాజశేఖరరెడ్డితో సాన్నిహిత్యం ఉండేది. 2004 ఎన్నికల్లో గెలిచేముందు వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు ప్రజలు ఏవిధంగా బ్రహ్మరథం పట్టారో..ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు రెట్టింపు ఆదరణ లభించింది. అప్పుడు రాజశేఖరరెడ్డితో పాటు పాదయాత్ర నేనూ చేశాను.
Comments
Please login to add a commentAdd a comment