Samadhan
-
వాన దేవునిపై ఫిర్యాదు.. వైరలవుతోన్న లేఖ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు వర్షాభావంతో అల్లాడుతున్నాయి. దాంతో సకాలంలో వానలు కురిపించని వరుణుడిపై, అతనికి ఆ మేరకు ఆదేశాలివ్వని ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎన్ వర్మ అనే ఓ రెవెన్యూ అధికారి తీర్మానించాడు! ఈ మేరకు ఏకంగా జిల్లా కలెక్టర్‌కే సిఫార్సు చేశాడు!! జరిగిందేమిటంటే...వర్షాభావానికి ఇంద్రుడు, వరుణుడే బాధ్యులని ఆరోపిస్తూ ఫిర్యాదుల స్వీకరణ దినం (సమాధాన్ దివస్) సందర్భంగా గోండా జిల్లాకు చెందిన సుమిత్‌కుమార్ యాదవ్ అనే రైతు వర్మకు లేఖ ఇచ్చాడు. జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల జనజీవనంపై ప్రతికూల ప్రభావం పడిందని యాదవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులపై ఇద్రుడిని నిందిస్తూ ఇలా లేఖ రాశారు. చాలా నెలలుగా వర్షాలు పడలేదని గౌరవనీయమైన అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి జంతువులు, వ్యవసాయంపై కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీంతో ఆయా కుటుంబాల్లోని మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున, ఈ విషయంలో వరుణుడిపై తగు చర్యలు తీసుకుని బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాము.’ అని పేర్కొన్నాడు. ఇంతో ఎన్ఎన్ వర్మ .. లేఖను పూర్తిగా చదవకుండానే ‘బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవా’లని సిఫార్సు చేస్తూ ఆ లేఖను ఏకంగా కలెక్టర్ కార్యాలయానికి పంపాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. దాంతో నాలుక్కరుచున్న వర్మ, తానసలు ఆ లేఖ పంపనే లేదు పొమ్మని బుకాయిస్తున్నాడు. సమాధాన్ దివస్‌లో వందలాది ఫిర్యాదులు వస్తుంటాయి గనుక బహుశా చదవకుండానే లేఖను ఫార్వర్డ్ చేసి చిక్కుల్లో పడ్డాడని అధికారులు అంటున్నారు. ఇంతకూ ఇంద్ర వరుణులపై కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలంటూ నెటిజన్లు హాస్యం పండిస్తున్నారు. -
వేడెక్కిన ఏజెన్సీ
విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాధాన్ పేరుతో పీడీత ప్రజలను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తూ మావోయిస్టులు ఈనెల 25వతేదీ నుంచి నిరసన వారోత్సవాలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఏవోబీలో భయానిక వాతావరణం నెలకొంది. కొయ్యూరు(పాడేరు), అరకులోయ: సాధారణంగా మావోయిస్టులు ఏడాదిలో రెండుసార్లు మాత్రమే వారోత్సవాలను నిర్వహిస్తారు. మొదటిది జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమర వీరుల వారోత్సవాలను నిర్వహిస్తారు. డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు ప్రజాగెరిల్లా విముక్తి దళం(పీఎల్జీఏ) వారోత్సవాలను నిర్వహిస్తారు. మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్రం చేపట్టినఆపరేషన్ సమాధాన్‌కు వ్యతిరేకంగా ఈ సారి నిరనస వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నెల 31 భారత్‌బంద్ చేయాలని పిలుపునిచ్చిందిమిలటరీ వ్యూహ రచనలో దిట్టయిన నాంబళ్ల కేశవరావు అలియాస్ గంగన సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బా«ధ్యతలు స్వీకరించిన తరువాత నిర్వహిస్తున్న రెండో వారోత్సవాలివి. ఈ నిరసన వారోత్సవాల్లో మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడే వీలుందని పోలీసులు భావిస్తున్నారు. ఏవోబీఎస్‌జెడ్‌సీ అధికార ప్రతినిధి జగబ ంధు పేరిట కొద్ది రోజుల కిందట నిరసన వారోత్సవంపై ప్రకటన వెలువడింది. కేంద్రంలో ఉన్న బీజేపీ,రాష్ట్రంలో టీడీపీలు మావోయిస్టు ఉద్యమాన్ని అణిచివేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాయని ఆరోపించారు.సెల్‌టవర్లు పేల్చేస్తారని లేదా ఇతర సౌకర్యాలను నాశనంచేస్తారని ఆరోపిస్తూ పోలీసులు గిరిజనులతో ర్యాలీలు చేయిస్తున్నారని ఆరోపించారు. సంతలు ,బ్యాంకులకు వెళ్తున్న గిరిజనులను బలవంతంగా తీసుకుపోయి లొంగుబాట్లు చూపిస్తున్నారని విమర్శించారు. నిరసన వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు విధ్వంసాలకు పాల్ప డే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల మావోయిస్టులు పలకజీడి వారపు సంతలో కరపత్రాలను ఎక్కువగా వేస్తున్నారు. ఈ రెండు నెలల్లో మూడుసార్లు కరపత్రాలను వేశారు.ఒకసారి సంతలో వ్యాపారులపై వేస్తే ఇటీవల పోలీసులకు వ్యతి రేకంగా పోస్టర్లు వేశారు.దీంతో పోలీసులు అటువైపు కూంబింగ్ ఉధృతం చేశారు. నేతలకు హెచ్చరికలు నిరసన వారోత్సవాలు ముగిసేంత వరకు బీజేపీ,టీడీపీ నేతలు,ఇతర ప్రజాప్రతినిధులు మారుమూల గ్రామాల్లో పర్యటనలు మానుకోవాలని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.ముంచంగిపుట్టు,పెదబయలు,హుకుంపేట,జైపూర్ జంక్షన్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. పోలీసులు అప్రమత్తం ఏవోబీ వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్నతాధికారులు రెడ్ ఆలర్ట్‌ను అమలుచేస్తున్నారు.ఏపీ,ఒడిశా సీఎంలు చంద్రబాబు,నవీన్పట్నాయిక్లు కూడా సరిహద్దులోని గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని జగబంధు ఆరోపించడంతో ఈ రెండు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. మల్క న్గిరి,కోరాపుట్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాలతో పాటు,అవుట్ పోస్టులు ఉన్న కటాఫ్ ఏరియాలో పోలీసు పార్టీలు కూంబింగ్ చర్యలను విస్తృతం చేశాయి. విశాఖ ఏజెన్సీ మారుమూల ప్రాంతాలపై నిఘా పెంచారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు పార్టీలు వాహనాల తనిఖీలు మమ్మురం చేశాయి. మద్దిగరువులో మావోయిస్టు వాల్‌పోస్టర్లు జి.మాడుగుల(పాడేరు): మండలంలో బొయితిలి పంచాయతీ మద్దిగరువు, సూరిమెట్ట పులుసుమామిడి గ్రామాల్లో బుధవారం రాత్రి మావోయిస్టుల వాల్‌పోస్టర్లు వెలిశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... హిందూ ఎజెండాతో మైనార్టీలు, మహిళలు, పీడిత సామాజిక వర్గాలపై చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని వాటిలో పేర్కాన్నారు. ఉద్యమ ప్రాంతాల్లో ప్రజలపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టులకు, బూటకపు లొంగుబాట్లకు అధికార పార్టీ నాయకులు బాధ్యతవహించాలని హెచ్చరించారు. సమాధాన్ పేరుతో ప్రజలపై కొనసాగుతున్న యుద్ధానికి వ్యతిరేకిస్తూ జనవరి 25 నుంచి 30 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీల ద్వారా నిరసనలు తెలిపాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. జనవరి 31న భారత్‌బంద్‌లో భాగంగా ఏవోబీలో బంద్ విజయవంతం చేయాలని కోరింది. -
నక్సల్స్‌పై ఇక సమరమే!
-
నక్సల్స్‌పై సమరమే!
మరింత కఠినంగా, దూకుడుగా ముందుకెళ్లాలి ► ‘సమాధాన్’ వ్యూహాన్ని సూచించిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ► ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. నక్సల్స్ వ్యతిరేక కార్యక్రమాల్లో మరింత కఠినంగా, దూకుడుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వె ల్లడించారు. ఢిల్లీలో సోమవారం ప్రారంభమైన మావో యిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల రెండ్రోజుల సదస్సులో రాజ్‌నాథ్ ప్రారంభోపన్యాసం చేశారు. ‘మన విధానాల్లో దూకుడు పెంచాలి. మన ఆలోచనల్లో, వ్యూహాల్లో, బలగాల మోహరింపులో, వ్యూహాల అమలులో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతా ల్లో రోడ్ల నిర్మాణంలో ఈ దూకుడు కనిపించాలి. మితిమీరిన ఆత్మరక్షణతో ఉండటం వల్లే కార్యాచరణలో పక్కాగా వ్యవహరించలేకపోతున్నాం’ అని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. నక్సల్స్ ఏరివేతకు రాష్ట్రాలే బాధ్యత తీసుకోవాలన్నారు. ఆర్థికంగా దెబ్బతీస్తే సరి..: ‘మావోయిస్టుల ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే ఈ పోరాటంలో అత్యంత కీలకం. సరిపోయేన్ని ఆర్థిక వనరులున్నప్పుడే వారు ఆయుధాలు కొంటారు. అందుకే ఆర్థిక వనరులను దెబ్బతీయటం చాలా అవసరం’ అని రాజ్‌నాథ్ తెలిపారు. మావోలను అణిచివేసేందుకు ‘సమాధాన్’ (SAMADHAN) వ్యూహా న్ని రాజ్‌నాథ్ చెప్పారు. ఎస్– స్మార్ట్ నాయకత్వం (స్మార్ట్ లీడర్ షిప్ , ఏ– దూకుడైన వ్యూహం (అగ్రెసివ్ స్ట్రాటజీ), ఎం–ప్రేరణ, శిక్షణ (మోటివేషన్ అండ్ ట్రైనింగ్, ఏ–కార్యాచరణలో కనిపించే ఇంటెలిజెన్స్ (యాక్షనబుల్ ఇంటెలిజెన్స్), డీ–డాష్‌బోర్డు ఆధారిత కేపీఐ (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)లు, కేఆర్ఏ (కీ రిజల్ట్ ఏరియా)లు, హెచ్– ఆధునిక సాంకేతికత వినియోగం (హార్నెసింగ్ టెక్నాలజీ), ఏ–ప్రతి విభాగానికి ప్రత్యేక కార్యాచరణ (యాక్షన్ ప్లాన్ ఫర్ ఈచ్ థియేటర్), ఎన్– ఆర్థిక వనరులు అందకుండా చేయట (నో యాక్సెస్ టు ఫైనాన్సింగ్)మే సమాధాన్ వ్యూహమని వివరించారు. ఏపీ, తెలంగాణ నుంచి: మావో తీవ్రవాదం ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదని, ఇది జాతీయ సమస్యని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఈ సమావేశంలో తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీలో గ్రేహౌం డ్స్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని చినరాజప్ప కేంద్రాన్ని కోరారు. ఏపీ,తెలంగాణ మధ్య భద్రత విష యంలో సమన్వయ లోపం లేదని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. తమకు మరిన్ని బలగాలను కేటా యించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ సమావేశంలో తెలంగాణ తరపున పాల్గొన్న డీజీపీ అనురాగ్ శర్మ.. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో మావో సమస్య ఉందన్నారు. అదనపు బలగాలపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. నక్సల్స్ ఏరివేతకు ఆర్మీ నో! మావోలతో పోరాడుతున్న సాయుధ బలగాలకోసం ఏర్పాటుచేసే క్యాంపుల్లో అన్ని వసతులూ ఉండాలని రాజ్‌నాథ్ ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల మాదిరిగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్ని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఉండాలన్నారు. కాగా, నక్సల్స్ వ్యతిరేక కార్యక్రమాల్లో ఆర్మీని వినియోగించబోమని హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహరిషి చెప్పారు. మావోల ఏరివేతకు 2వేల మంది కోబ్రా కమాండోలను సుక్మా జిల్లాలో రంగంలోకి దించనున్నట్లు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి తెలిపారు. పశ్చిమబెంగా ల్, బిహార్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో ఉన్న ఈ కోబ్రాలను సుక్మాకు పంపుతామన్నారు.