మిడ్జిల్, న్యూస్‌లైన్: మావోయిస్టుల పేర పోస్టర్ల ద్వారా హెచ్చరికల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారం తాజాగా మండలంలోని ఊర్కోండపేట్ గ్రామంలో సర్పంచ్‌ను హెచ్చరిస్తూ మరోపోస్టర్ వెలిసింది. ఈ పోస్టర్ స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలో ఆదివారం రాత్రి స్థానిక పాలసెంటర్ వద్ద ఊర్కోండపేట్ సర్పంచ్‌ను హెచ్చరిస్తూ వాల్‌పోస్టర్ వెలిసింది. ‘ గ్రామ సర్పంచ్‌కు కుక్కచావు తప్పదు. అధికారం అహంతో చెలాగాటమాడటం సమంజసం కాదు. గ్రామంలో అన్ని పార్టీలతో కలిసిపోతే బతుకగలవు’ అంటూ హెచ్చరిస్తూ మవోయిస్టుల పేరుతో మరియు మాజీ మవోయిస్టుల పేరుతో వాల్‌పోస్టర్ వేశారు.
ఈ పోస్టర్ చూసి సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ పోస్టర్‌ను తొలగించారు. మండలంలో ఇటీవల మావోయిస్టుల పేర వాల్‌పోస్టర్లు వెలవడం పట్ల నాయకులకు గుండెల్లో గుబులురేపుతోంది. గత గురువారం రాచాలపల్లి గ్రామ సర్పంచ్‌ను హెచ్చరిస్తూ వాల్‌పోస్టర్ వేయగా.. తాజాగా ఆదివారం ఊర్కోండపేట్ సర్పంచ్‌ను హెచ్చరిస్తూ పోస్టర్ వెలిసింది. ఈ విషయంలో పోలీసులు పెద్దగా స్పందించకపోవడంతో సర్పంచ్‌లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
మావోయిస్టుల పేర మరో వాల్‌పోస్టర్
Published Wed, Oct 16 2013 4:01 AM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM
Advertisement
Advertisement