ఉత్సాహంగా పరుగులుతీసిన యువత!
విశాఖపట్నం: విశాఖ బీచ్‌రోడ్‌లోని సబ్ మెరైన్ వద్ద తూర్పు నావికాదళం నిర్వహించిన మారథాన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఓవైపు లేలేత కిరణాలు .. మరోవైపు అలల హోరు .. యువత ఉత్సాహంగా పరుగులు తీసింది. తూర్పునావికాదళం వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ ఈ రన్ ప్రారంభించారు. మారథాన్, 5 కిలోమీటర్లు, 10కిలోమీటర్లు, సంకల్ప్ రన్ పేరుతో నాలుగు కేటగిరీల్లో రన్ నిర్వహించారు.
హుదూద్ తుపానును ధైర్యంగా ఎదుర్కొన్న విశాఖవాసుల స్ఫూర్తికి సెల్యూట్ చేస్తూ నేవీ ఈ రన్‌ను నిర్వహించింది. ఈ మారథాన్‌లో దేశవ్యాప్తంగా రెండు వేల మందికి పైగా రన్నర్స్ పాల్గొన్నారు.
**