తిరుపతి : దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి వేగవంతం అవ్వాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆపార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. దేశంలో అస్థిరత్వం నెలకొని ఉన్నందున అన్నిరంగాల్లో అభివృద్ధిలో వెనుకబడిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అనిశ్చితి తొలగితే పొత్తులుంటాయని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
సోనియాగాంధీ సూచన మేరకే కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని వెంకయ్యనాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలకు నిధుల కేటాయింపులు జరగాలని అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు సవరణలు జరగాలని... రాష్ట్ర విభజనకు బీజేపీ అనుకూలమని వెంకయ్య నాయుడు మరోసారి స్పష్టం చేశారు.
తెలంగాణ బిల్లుకు సవరణలు జరగాలి
Published Mon, Jan 27 2014 12:56 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement