ఇసుకాసురులు | market price of sand | Sakshi
Sakshi News home page

ఇసుకాసురులు

Published Sun, Jul 26 2015 12:28 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

ఇసుకాసురులు - Sakshi

ఇసుకాసురులు

ర్యాంపుల్లో భారీగా  లారీలు, ట్రాక్టర్లు
రాత్రి వేళల్లో నాటు బళ్లు
లెక్క, పత్రం లేని ఇసుక రవాణా
అధికారపార్టీ నాయకుల అండతోనే నిర్వహణ
రూ. 9వేల విలువైన ఇసుక మార్కెట్ ధర రూ.25 నుంచి రూ.40వేలు

 
అధికారం అండతో ఇసుకాసురులు రెచ్చిపోతు న్నారు. అధికారుల కళ్లుగప్పి అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధన లకు పాతర వేసి అడ్డంగా తవ్వేస్తున్నారు. పేరుకే మహిళా సంఘాలకు కేటాయించినా పెత్తనం అంతా అధికారపార్టీ నాయకులదే. జిల్లాలో గతంలో 26చోట్ల ఇసుక తవ్వకాలకు రీచ్‌లు కేటాయించినప్పటికీ ప్రస్తుతం 9చోట్ల రేవులు నడుస్తున్నాయి. పర్లాం, పొన్నాడ, మబగాం, గోపాలపెంట, చేనులవలస, కిల్లిపాలెం, హయాతినగరం, సింగూరు, ముద్దాడపేట ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు నడుస్తున్నా అన్నింటా అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి.
 
శ్రీకాకుళం : జిల్లాలో ఇసుక రీచ్‌లు అక్రమాలకు వేదికలువుతున్నాయి. అధికార పార్టీ అండతో తమ్ముళ్లే సొమ్ము చేసుకుంటున్నా రు.  రేవులో 10నుంచి 12మంది మహిళలు నిర్వహించా ల్సి ఉండగా ఐదుగురు, ఆరుగురు కంటే మహిళలు ఉండడం లేదు. ఇసుక అమ్మకాలపై వారికి అందాల్సిన కమీషన్‌నూ బొక్కేస్తున్నారు. ప్రతీ రీచ్‌లోనూ అధికారపార్టీ నాయకుల అనుచరులతోపాటు మెప్మా, డీఆర్‌డీఏ సిబ్బంది ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.

 కొలమానం ఎక్కడ?
 కొనుగోలు దారులు తమకు కావాల్సిన పరిమాణం మేర కు క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.500చొప్పున మీసేవ సెంటర్‌లో డబ్బు చెల్లించి రశీదు తీసుకువచ్చి ఇస్తే కొల త లు తీసి లెక్క ప్రకారం ఇసుక ఇవ్వాలి. ఇక్కడే అక్రమా లు చోటు చేసుకుంటున్నాయి. డీడీకి సరిపడా ఇసు క కంటే అదనంగా ఇస్తూ వాహనదారులనుంచి అక్రమంగా సొమ్ము వసూలు చేస్తున్నా రు. ఒక్కో రేవులో రోజుకు కనీసం 70 ట్రాక్టర్ల ఇసుక (ఒక్కో ట్రాక్టర్‌లో మూడు క్యూబిక్ మీటర్ల ఇసుక పడుతుంది) రవా ణా అవుతోంది. అంతే కాకుండా ఒక్కో వాహనం నుంచీ కనీసం రూ.300లకు తక్కువ లేకుండా నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. చాలాచోట్ల నాయకులే వాహనా లు తెప్పించి బినామీల పేరిట డీడీలు తీయిం చి విశాఖకు తరలిస్తున్నారు. ఒక్కో లారీలో 18నుంచి 21క్యూబిక్ మీటర్ల ఇసుక రవాణా జరుగుతోంది. ఒకలారీ ఇసుక 10 నుంచి 12 ట్రాక్టర్లకు సమానం. వాహనాలను కేటగిరీగా బి భజించి ఓ కోడ్ కేటాయిస్తున్నారు. ఫలానా వాహనం  వచ్చిందంటే చాలు డీడీ తీసుకొని లెక్క కంటే ఎక్కువగానే ఇసుకను ఇచ్చేస్తున్నారు. లారీల్లో ఇసుకపై అనుమానం వస్తే వే బ్రిడ్జి ద్వారా తూయించాలి. అదే విధంగా తోపుడుబళ్లు, నాటుబళ్లపై ఇసుక రవాణా నిషిద్ధం. దీనివల్ల బళ్లయజమానుల జీవనోపాధి దెబ్బతింటోందని గగ్గోలు పెట్టిన టీడీపీ నాయకులకు ఇప్పుడు డబ్బు కురిపించే ఆయుధంగా మారింది. ప్రభుత్వం తోపుడు, నాటు బళ్లకు అనుమతి ఇవ్వకున్నా రాత్రి వేళల్లో వీటిపై భారీగా రవాణా చేస్తున్నారు.

 వాటినుంచి అనధికారికంగా ఆశీలు వసూలు చేస్తున్నారు. లారీ ఇసుకకు కేవలం రూ.9వేలు చెల్లిస్తే ఆ ఇసుక మార్కెట్లో రూ.30నుంచి 40వేల వరకు అమ్ముడవుతోంది. మధ్యలో ఎవరైనా ఆపితే రూ.500నుంచి రూ.1000లంచం ఇస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.1500. క్వారీ లారీ ఇసుక ధర రూ.4750. ఇవన్నీ ప్రభుత్వ ధరలే. అయితే మార్కెట్లో డిమాండ్ బట్టీ ఇసుకను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యార్డులు నిర్మించి నిల్వ చేస్తున్నా అధికార పార్టీ నాయకుల అండదండలుండడంతో అధికారులు కిమ్మనడంలేదు.

 బల్క్ పేరిట వాహనాల రద్దీ
 ప్రముఖ సంస్థలు, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలకు బల్క్ ఆర్డర్ వస్తోంది. వీటికి కలెక్టర్ అనుమతి తప్పనిసరి. కానీ పొరుగు జిల్లాలకు చెందిన బిల్డర్లు, అధికంగా వాహనాలున్న వ్యక్తులూ ఇతరుల పేరిట డీడీలు తీసి బయట ప్రాంతాల్లో అమ్ముకుంటున్నారు. ఇందుకు అన్ని స్థాయిల్లోనూ కమీషన్లు వెళ్తుంటాయి. ఇవేవీ కలెక్టర్ దృష్టికి వెళ్లడంలేదు. మహిళా సంఘాల సభ్యులు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరుగంటలవరకే విధుల్లో ఉంటారు. మిగతా సమయాల్లో బినామీలే రాజ్యమేలుతున్నారు. ఇలా ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో 9రీచ్‌ల ద్వారా ఒక్క నెలలోనే రూ.25కోట్లు చేతులు మారాయన్న విషయం అధికారులకూ తెలుసు. హయాతినగరంలో గత నెల 16న ప్రారంభమైన రేవు పేరుకు శ్రీమహలక్ష్మి మహిళా సంఘానిదే అయినా దీని వెనుక జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు మేనల్లుడు దాసునాయుడు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆమె అనుచరులు గుమ్మానాగరాజు తదితరులు, ఆమె పీఏ, ఎంపీ రామ్మోహన్‌నాయుడు అనుచరులు పెత్తనం వహిస్తున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement