వివాహిత అనుమానాస్పద మృతి | married women died | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Published Fri, Jan 1 2016 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

మండలంలో పెంట గ్రామానికి చెందిన మర్రాపు జయలక్ష్మి (ప్రమీల) బుధవారం అర్ధరాత్రి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు.

పెంట (బొబ్బిలి రూరల్) : మండలంలో పెంట గ్రామానికి చెందిన మర్రాపు జయలక్ష్మి (ప్రమీల) బుధవారం అర్ధరాత్రి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. తన భార్య చున్నీతో ఉరి వేసుకుందని భర్త నాగభూషణరావు చెబుతుండగా, తమ కుమార్తెను భర్త, అతని కుటుంబ సభ్యులే అదనపు కట్నం కోసం హత్య చేశారని మృతురాలి తండ్రి జి. గౌరునాయుడు ఆరోపిస్తూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని డీఎస్పీ రమణమూర్తి, సీఐ రవి, ఎస్సై రవీంద్రరాజులతో పాటు తహశీల్దార్ మాసిలామణి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు.  భర్త, అత్త, మామ, మరిదిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.  
 
 వివాహం అరుున కొద్ది నెలలకే..
 పార్వతీపురం మండలం బంటువానివలసకు చెందిన జయలక్ష్మికి బొబ్బిలి మండలం పెం ట గ్రామానికి చెందిన నాగభూషణరావుతో 2015 ఫిబ్రవరి 25న వివాహం జరిగింది.  వివాహ సమయంలో 1,50,000 రూపాయల నగదు, తులంన్నర బంగారం వరకట్నంగా అందించారు. అరుునా అదనపు కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్త శకుంతుల, మామ గోపాల, మరిది మోహనరావులు నిత్యం వేధించేవారని జయలక్ష్మి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లైన పది నెలలకే  తన కుమార్తెకు నూరేళ్లు నిండిపోయూయని వారు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement