గుంటూరు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ(సీఎంఏ) విడుదల చేసిన సీఎంఏ డిసెంబర్-2014 ఇంటర్, ఫైనల్ పరీక్ష ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం జరిగింది. మోహన్ మాట్లాడుతూ.. అఖిల భారతస్థాయిలో ప్రకటించిన టాప్-50 ర్యాంకర్ల జాబితాలో తమ విద్యార్థులు 9, 10, 27, 29, 31, 41వ ర్యాంకులు కైవసం చేసుకున్నారని చెప్పారు.
ఫైనల్ విభాగంలో ఎం.ఆనంద్ కృష్ణ 9వ ర్యాంకు, జి.శ్రీనివాస్ 10, డి.సాయిరామ్ 27, గురు మోహిత్ జైన్ 31, పి.సాయి ప్రసన్న లక్ష్మి 29, పి.మహేష్ కుమార్ 41, ఇంటర్ విభాగంలో పి.మధులిక 11, వి.గౌరీ శంకర్ 14, టి.సాయి అవినాష్ 14, ఐ.శ్రావణి 28, కె.శివారెడ్డి 41వ ర్యాంకులు సాధించారని వివరించారు. సీఎంఏ జూన్-2014 ఫలితాల్లో తమ విద్యార్థులు అఖిల భారతస్థాయిలో ప్రథమ ర్యాంకు, ఫైనల్‌లో 2, 3వ ర్యాంకులు కైవసం చేసుకున్నారని తెలిపారు. సీఏ కోర్సుల్లో మాస్టర్‌మైండ్స్ నుంచి జాతీయస్థాయిలో ర్యాంకులు సాధిస్తున్న విద్యార్థులందరూ ఇంటర్ నుంచి తమ వద్ద చదివిన వారేనని చెప్పారు.