ఘనంగా ‘మాస్టర్ మైండ్స్’ వార్షికోత్సవం | grandly master minds celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా ‘మాస్టర్ మైండ్స్’ వార్షికోత్సవం

Published Mon, Feb 24 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM

grandly master minds celebrations

 సాక్షి, ముంబై: సూరత్‌లో ఉన్న ప్రతాప్‌నగర్‌లో ‘మాస్టర్ మైండ్స్’ తెలుగు పాఠశాల వార్షికోత్సవాలు శనివారం సాయంత్రం శ్రీ మార్కండేయ సహదేవ్ మంది రంలో ఘనంగా నిర్వహించారు. కాగా, 2012-2013 విద్యా సంవత్సరంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బహుమతులతోపాటు ప్రశం సా పత్రాలను అందజేశారు.
 ఈ సందర్భంగా ముఖ్య అతిథి, తెలుగు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాపోలు బుచ్చిరాములు మాట్లాడుతూ తెలుగు భాష అంతరించిపోతున్న ఈ రోజుల్లో ఇక్కడ స్థిరపడిన తెలుగు విద్యార్థులకు గుజరాత్ ప్రభుత్వ ఆమోదంతో పదోతరగతి వరకు మాతృభాషలో విద్యను బోధిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
 
 కార్యక్రమంలో తెలుగు కార్పొరేటర్‌లు రాపోలు లక్ష్మి, పి.పి.ఎస్ శర్మ, పాఠశాల వ్యవస్థాపకుడు బుదారపు రమేష్, సార్వజనిక్ హైస్కూల్ ప్రిన్సిపల్ సొనార్, పి.వి.పి.ప్రసాద్, మందిరం కమిటీ  సభ్యులు సిరిమల్లె గణేష్, ఎలిగే టి నాగేష్, చిట్యాల రాము, వెంగళ్‌దాసు, సత్యనారాయణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యా లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement