master minds
-
కాలేయ వ్యాధితో బాధపడే బాలికకు మాస్టర్ మైండ్స్ సాయం
-
‘సీఎంఏ’ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ హవా
గుంటూరు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ(సీఎంఏ) విడుదల చేసిన సీఎంఏ డిసెంబర్-2014 ఇంటర్, ఫైనల్ పరీక్ష ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం జరిగింది. మోహన్ మాట్లాడుతూ.. అఖిల భారతస్థాయిలో ప్రకటించిన టాప్-50 ర్యాంకర్ల జాబితాలో తమ విద్యార్థులు 9, 10, 27, 29, 31, 41వ ర్యాంకులు కైవసం చేసుకున్నారని చెప్పారు. ఫైనల్ విభాగంలో ఎం.ఆనంద్ కృష్ణ 9వ ర్యాంకు, జి.శ్రీనివాస్ 10, డి.సాయిరామ్ 27, గురు మోహిత్ జైన్ 31, పి.సాయి ప్రసన్న లక్ష్మి 29, పి.మహేష్ కుమార్ 41, ఇంటర్ విభాగంలో పి.మధులిక 11, వి.గౌరీ శంకర్ 14, టి.సాయి అవినాష్ 14, ఐ.శ్రావణి 28, కె.శివారెడ్డి 41వ ర్యాంకులు సాధించారని వివరించారు. సీఎంఏ జూన్-2014 ఫలితాల్లో తమ విద్యార్థులు అఖిల భారతస్థాయిలో ప్రథమ ర్యాంకు, ఫైనల్లో 2, 3వ ర్యాంకులు కైవసం చేసుకున్నారని తెలిపారు. సీఏ కోర్సుల్లో మాస్టర్‌మైండ్స్ నుంచి జాతీయస్థాయిలో ర్యాంకులు సాధిస్తున్న విద్యార్థులందరూ ఇంటర్ నుంచి తమ వద్ద చదివిన వారేనని చెప్పారు. -
మాస్టర్‌మైండ్స్‌కు జాతీయ ర్యాంకులు
గుంటూరు: ఐసీఏఐ బుధవారం విడుదల చేసిన సీఏ-ఐపీసీసీ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ సీఏ విద్యాసంస్థల విద్యార్థులు అఖిల భారత స్థాయి టాప్-50 ర్యాంకుల్లో 9 ర్యాంకులు సాధించి సంచలన విజయం నమోదు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక ర్యాంకులు కైవసం చేసుకున్న సంస్థగా మాస్టర్‌మైండ్స్ నిలిచింది. విద్యార్ధి జె. భిక్షాలు బాబు అఖిల భారతస్థాయిలో 9వ ర్యాంకు, కె.పవన్‌కుమార్ 24వ ర్యాంకు, కె.రవితేజ 25వ ర్యాంకు, పి.మధులిక 34వ ర్యాంకు, ఎస్.కార్తీక్ 34వ ర్యాంకు, టి.శ్రీకాంత్ 34వ ర్యాంకు, కె.రాజ్యవర్ధన్ రెడ్డి 39వ ర్యాంకు, వి.వెంకట రోహిత్ 41వ ర్యాంకు, వై.సాయి కిరణ్మయి 50వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా గుంటూరులో జరిగిన విలేకర్ల సమావేశంలో సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ విద్యార్థులను అభినందించారు. సీఏ ఫైనల్, ఫౌండేషన్, సీఏ-సీపీటీ, ఐపీసీసీ ఫలితాల్లో జాతీయ స్థాయి ర్యాంకులు కైవసం చేసుకుని తిరుగులేని విజయం అందుకున్నామని చెప్పారు. -
ఘనంగా ‘మాస్టర్ మైండ్స్’ వార్షికోత్సవం
సాక్షి, ముంబై: సూరత్‌లో ఉన్న ప్రతాప్‌నగర్‌లో ‘మాస్టర్ మైండ్స్’ తెలుగు పాఠశాల వార్షికోత్సవాలు శనివారం సాయంత్రం శ్రీ మార్కండేయ సహదేవ్ మంది రంలో ఘనంగా నిర్వహించారు. కాగా, 2012-2013 విద్యా సంవత్సరంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బహుమతులతోపాటు ప్రశం సా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, తెలుగు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాపోలు బుచ్చిరాములు మాట్లాడుతూ తెలుగు భాష అంతరించిపోతున్న ఈ రోజుల్లో ఇక్కడ స్థిరపడిన తెలుగు విద్యార్థులకు గుజరాత్ ప్రభుత్వ ఆమోదంతో పదోతరగతి వరకు మాతృభాషలో విద్యను బోధిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో తెలుగు కార్పొరేటర్లు రాపోలు లక్ష్మి, పి.పి.ఎస్ శర్మ, పాఠశాల వ్యవస్థాపకుడు బుదారపు రమేష్, సార్వజనిక్ హైస్కూల్ ప్రిన్సిపల్ సొనార్, పి.వి.పి.ప్రసాద్, మందిరం కమిటీ సభ్యులు సిరిమల్లె గణేష్, ఎలిగే టి నాగేష్, చిట్యాల రాము, వెంగళ్‌దాసు, సత్యనారాయణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యా లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.