ఏఎఫ్‌ఆర్సీ నిర్ణయంపై ప్రైవేటు మెడికల్ కాలేజీల అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీబీఎస్ కోర్సుకు ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమి టీ (ఏఎఫ్‌ఆర్సీ) నిర్ణయించిన కామన్ ఫీజుపై ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై హైకోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నాయి. కొన్ని రోజులుగా కామన్ ఫీజుపై కసరత్తు చేసిన ఏఎఫ్‌ఆర్సీ.. ఎంబీబీఎస్ కోర్సులో ఏడాదికి రూ. 3.10 లక్షల నుంచి రూ. 3.75 లక్షల వరకూ ఫీజు ఉండాలని ప్రభుత్వానికి ప్రతిపాదన ఇచ్చింది. కాలేజీలో వసతులను బట్టి గరిష్టంగా రూ. 3.75 లక్షలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదని నివేదికలో పేర్కొంది. దీనిపై రెండ్రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే కాలేజీల నిర్వహణ భారం పెరిగిం దని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కళాశాల గ్రేడును బట్టి ఏడాదికి రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ ఫీజు ఉండేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలు డిమాం డ్ చేశాయి. ఇలాగైతే తాము ప్రైవేటు పరీక్షకైనా, ప్రభుత్వమే ప్రవేశపరీక్ష నిర్వహించి సీట్లు భర్తీ చేసినా తమకేమీ అభ్యంతరం లేదని తెలిపాయి. అయితే ఏఎఫ్‌ఆర్సీ గరిష్టం గా రూ. 3.75 లక్షలే ఫీజుగా నిర్ణయించడంతో ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే హైకోర్టును ఆశ్రయిస్తామని ఓ మెడికల్ కాలేజీ యాజమాన్య ప్రతినిధి తెలిపారు. ఒకవేళ యాజ మాన్యాలు కోర్టుకెళితే పాత పద్ధతి ప్రకారమే అడ్మిషన్లు నిర్వహించే పరిస్థితి వస్తుంది. అంటే అవి తమ ఇష్టానుసారం సీట్లను భర్తీ చేసుకోవచ్చు.
ఎంబీబీఎస్ కామన్ ఫీజుపై కోర్టుకు!
Published Sun, Jun 1 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM
Advertisement