మెడికల్ కళాశాల పరిశీలన కోసం జిల్లాకు రానున్న ఎంసీఐ బృందం
నివేదికలు సిద్ధం చేస్తున్న వైద్యాధికారులు
రెండవ సంవత్సరం అనుమతి లభించేనా
మొదటి ఏడాదే షరతులతో మంజూరు
అందుబాటులో లేని ప్రొఫెసర్లు
కనీస వసతులు కూడా కరువే
బోధనలో తీవ్ర అంతరాయం
కళాశాలను వీడుతున్న విద్యార్థులు
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం త్వరలో జిల్లాకు రానుంది. మెడికల్ కళాశాలలో రెండవ సంవత్సరం తరగతులకు అనుమతినిచ్చే విషయాన్ని పరిశీలించనుంది. ఇందుకు సంబంధించి కళాశాల అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. వసతులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఎంసీఐ బృందం సికింద్రాబాద్ గాంధీ ఆ స్పత్రిలో ఉంది. అక్కడ పరిశీలన సక్రమంగా పూర్తి అయితే ఈ నెల రెండున లేదంటే ఐదున జిల్లాకు వస్తుందని తెలుస్తోంది.
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్:
మెడికల్ కళాశాల అధికారుల కు ఎంసీఐ బృందం పరిశీలన భ యం పట్టుకుంది. గత ఏడాది మొ దటి సంవత్సరానికి సంబంధించిన ఏర్పాట్లు, ప్రొఫెసర్ల నియామకం స క్రమంగా జరిగినా ఎంసీఐ మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. కళాశాలకు మొదట అనుమతి నిరాకరించి, ఆ తరువాత షరతులతో కూడిన అనుమతిని మం జూరు చేసింది. రెండవ సంవత్సరానికి సంబంధించి సమస్యలూ అదే విధంగా ఉన్నాయి. కళాశాలకు కేటాయించిన 116 మంది ఫ్రొఫెసర్లు నేటికీ పూర్తి స్థాయిలో అందుబాటులో లేరు. 38 మంది ఉన్నా,కళాశాలకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేక తరగతుల నిర్వహణ పూర్తిగా జరగలేదు. ఐదుగురు ప్రొఫెసర్లు మాత్రమే విద్యాబోధన చేపట్టారు.
ఆగస్టులో ప్రారంభం కావల్సిన శవపరీక్ష బోధన డిసెంబ ర్‌లో ప్రారంభమైంది. ఇంటర్నల్ పరీక్షలు అయిపోయిన తరువాత దీనిని ప్రారంభించారు. దీంతో విద్యార్థులు పలుమార్లు ప్రిన్సిపాల్‌ను కలిసి తగిన చర్యలు తీసుకో వాలని విన్నవించారు. ఏడుగురు విద్యార్థులు అడ్మిషన్ రద్దు చేసుకొని ఇతర కళాశాలలకు వెళ్లిపోయారు. అయినా పూర్తి స్థాయి విద్యాబోధన, ఏర్పాట్లు జరుగడం లేదు. కేటాయించిన ప్రొఫెసర్లు కళాశాల వైపు కన్నెత్తి చూడలేదు. వారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటేనే రెండవ సంవత్సరానికి అనుమతి వచ్చే అవకాశం ఉంది. మొ దటి సంవత్సరం విద్యార్థులకు స్టడీ మెటీరియల్, గ్రంథాలయం అందుబాటులో లేదు. విద్యార్థులు కోరితే తాత్కాలిక ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారు.
ఇంకా మారని ఆస్పత్రి
మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జిల్లా ఆస్పత్రి మారలేదు. సగం విద్యా సంవత్సరం ముగిసినా ఆస్పత్రి మాత్రం కళాశాల పరిధిలోకి వెళ్లలేదు. గతంలో ఎం సీఐ పరిశీలనలో ఆస్పత్రిని మెడికల్ కళాశాల అనుబంధంగా చూపించారు. త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇస్తుందని తెలిపారు. కాని నేటి వరకు ఆస్పత్రి మా ర్పు జరుగలేదు. ఆస్పత్రిలో వివిధ వార్డుల ఏర్పాటు అస్తవ్యస్తంగా ఉందని, తక్షణమే వైద్యపరీక్షల నిర్వహణ, వికలాంగులకు గదులు మొదటి అంతస్తులో ఏర్పాటు చేయాలని ఎంసీఐ బృందం సూచించింది. అది ఇంకా అమలు కాలేదు. ఆస్పత్రి వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉండడంతో మెడికల్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రావడం లేదు. వీరు ఈ విషయాన్నే ఎంసీఐ బృందం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిసింది. కళాశాలకు ఇటీవలే ప్రభుత్వం 810 పోస్టులను మంజూ రు చేసింది. నియమకాలు మాత్రం చేపట్టలేదు. పరిపాలన విభాగం, నాల్గవ తరగతి ఉద్యోగులు, సిబ్బంది, పారామెడికల్ ఉద్యోగుల నియామకాలూ జరుగలేదు.
కొనసాగుతున్న ఏర్పాట్లు
వీటన్నింటినీ ప్రస్తుతం ఎంసీఐ బృందం పరిశీలించే అవకాశం ఉంది. నియామకాలను అక్టోబరులోనే పూర్తి చేయాలని అధికారులు భావించారు. వివిధ కారణాలతో అది సాధ్యం కాలేదు. రెండవ సంవత్సరానికి సంబంధించిన భవనాల నిర్మాణం పూర్తి అయ్యాయి. బోధనకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
నివేదికలు సిద్ధం చేస్తున్నాం
ఎంసీఐ బృందం ఫిబ్రవరి రెం డున లేదా ఐదున వచ్చే అవకా శం ఉంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం. నివేదికలు సిద్ధం చేస్తున్నాం. రెండవ సంవత్సరం అ నుమతి కోసం అవసరమైన పనులన్నింటిని పూ ర్తి చేస్తున్నాం. -జిజియాబాయి, ప్రిన్సిపాల్
ఈ సారి ఏమవుతుందో!
Published Tue, Jan 28 2014 3:00 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement