మంత్రి అఖిలప్రియకు ఎంసీఎంసీ నోటీసు | MCMC notice to Minister Bhooma Akhila Priya | Sakshi
Sakshi News home page

మంత్రి అఖిలప్రియకు ఎంసీఎంసీ నోటీసు

Published Fri, Aug 4 2017 3:29 AM | Last Updated on Mon, Sep 11 2017 11:11 PM

MCMC notice to Minister Bhooma Akhila Priya

కర్నూలు (అగ్రికల్చర్‌): రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ గురువారం నోటీసు ఇచ్చారు. ఇటీ వల ఒక ఆంగ్ల దినపత్రికకు మంత్రి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపును కాంక్షిస్తూ మాట్లాడారు.

 దీన్ని గమనించిన మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) చైర్మన్‌ అయిన కలెక్టర్‌.. ఇంటర్వ్యూను ఎందుకు పెయిడ్‌ న్యూస్‌గా పరిగణించరాదో చెప్పాలని నోటీసులో పేర్కొ న్నారు. అలాగే నంద్యాల నియోజకవర్గంలోని లోకల్‌ కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ల కు కూడా నోటీసులు జారీ చేశారు. నంద్యాలకు చెందిన నందికేబుల్, నంద్యాల సిటీ కేబుల్‌ నెట్‌వర్క్, ప్రజా కేబుల్‌ నెట్‌వర్క్, శిల్పా కేబుల్‌ నెట్‌ వర్క్‌లకు నోటీసులను కలెక్టర్‌ జారీ చేశారు. ప్రసారం చేస్తున్న కథనాలను పెయిడ్‌ న్యూస్‌గా ఎందుకు పరిగణించరాదో వివరణ ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement